వెరీ..వెరీ…స్పెషల్ ..!!
ఒక మంచి పోలీస్ అధికారిణిగా కిరణ్ బేడీ కి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. ఐపీఎస్ లలో అరుదైన ఆణిముత్యం గా కిరణ్ బేడీ దేశ వాసుల మదిలో [more]
ఒక మంచి పోలీస్ అధికారిణిగా కిరణ్ బేడీ కి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. ఐపీఎస్ లలో అరుదైన ఆణిముత్యం గా కిరణ్ బేడీ దేశ వాసుల మదిలో [more]
ఒక మంచి పోలీస్ అధికారిణిగా కిరణ్ బేడీ కి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. ఐపీఎస్ లలో అరుదైన ఆణిముత్యం గా కిరణ్ బేడీ దేశ వాసుల మదిలో వుంటారు. కరడుగట్టిన నేరస్థులు వుండే తీహార్ జైల్లో తనదైన సంస్కరణలు ప్రవేశపెట్టి కిరాతకుల్లో సైతం మార్పు తెచ్చిన కీర్తి ఆమెది. దేశంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటే భారత్ అఖండంగా వెలుగొందుతుంది అని నమ్మే ఒకప్పటి ఈ సిన్సియర్ అధికారిణి ప్రస్తుతం పుదుచ్చేరి గవర్నర్ గా వున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆమె తన మార్క్ ను జనం లో వేస్తూ ఉండటం ఆమె ప్రతి చర్య కూడా వైరల్ గా మారడం విశేషం.
ట్రాఫిక్ డ్యూటీ చేపట్టిన బేడీ …
గవర్నర్ హోదా లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు చాలామంది. కానీ కిరణ్ బేడీ రొటీన్ కి తాను భిన్నమని మరోసారి చాటిచెప్పారు. పుదుచ్చేరి – విల్లుపురం రోడ్డులో ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఆకస్మికంగా ఎత్తేశారు ఆమె. ప్రజల్లో కనిపించిన బాధ్యతారాహిత్యాన్ని గమనించి రోడ్డెక్కేశారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడ్ చేసే వారికి, హెల్మెట్ ధరించిన వారికి క్లాస్ లు పీకి వారి బాధ్యత గుర్తు చేశారు బేడీ. ఆమె ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా, సాంప్రదాయ మీడియా లో వైరల్ గా మారింది.
పేరుకు గవర్నర్ అయినా….
తాను పేరు కి గవర్నర్ అయినా సాధారణ జీవితం గడిపే కిరణ్ బేడీ ఆ మధ్య తనకు స్వాగతం పలుకుతూ కొందరు వేసిన ఫ్లెక్సీ చూసి దాన్ని తీయించి వేసి అది వేసిన వారికి దానికి అయిన డబ్బును తాను సొంతంగా ఇచ్చి ఇలా సొమ్ములు వృధా చేయొద్దని పేదవారి సేవకు ఆ మొత్తము వినియోగించాలని సూచించారు. ఫ్లెక్సీ ల వల్ల పర్యావరణానికి సైతం హానికలుగుతుందని మరిచిపోవొద్దని హెచ్చరించారు కూడా. విభిన్నమైన ఆలోచనలను ఆచరణలో చూపిస్తూ ఆదర్శంగానిలుస్తూనే వస్తున్నారు కిరణ్ బేడీ. ఇలా ఎక్కడ వున్నా ఏ పదవిలో వున్నా కిరణ్ బేడీ వెరీ వెరీ స్పెషల్ అనిపించుకుంటు అందరి ప్రశంసలు అందుకోవడం విశేషమే.