అమరావతి జేఏసీ నేత‌కు బాబు టిక్కెట్ ఇస్తారటగా ?

ఏపీలో అమ‌రావ‌తి ఉద్య‌మం ఏడాదిన్న‌ర కాలంగా జ‌రుగుతోంది. అమ‌రావ‌తి ఉద్య‌మానికి టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తోంది. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని పార్టీ త‌ర‌పున స్టాండ్ కూడా తీసుకుంది. [more]

Update: 2021-07-21 03:30 GMT

ఏపీలో అమ‌రావ‌తి ఉద్య‌మం ఏడాదిన్న‌ర కాలంగా జ‌రుగుతోంది. అమ‌రావ‌తి ఉద్య‌మానికి టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తోంది. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని పార్టీ త‌ర‌పున స్టాండ్ కూడా తీసుకుంది. ఇక టీడీపీ నేత‌ల‌తో పాటు అమ‌రావ‌తి జేఏసీ నేత‌లు కూడా అక్క‌డ అమ‌రావ‌తి కోసం పోరాటాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తి ఉద్య‌మం పేరుతో కొల‌క‌లూరి శ్రీనివాస‌రావు, రాయ‌పాటి శైల‌జ ఇలా కొంద‌రు నేత‌లు హైలెట్ అయ్యారు. అయితే ఉద్య‌మంలో హైలెట్ అయిన నేత‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తారంటూ ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. రాయ‌పాటి శైల‌జ‌కు న‌ర‌సారావుపేట ఎంపీ సీటు ఇవ్వాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. మొన్న‌టికి మొన్న గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ సైతం తాను గుంటూరు ఎంపీగా, శైల‌జ న‌ర‌సారావుపేట ఎంపీగా పోటీలో ఉంటామ‌ని బాబు ముందే స్వ‌యంగా చెప్పారు.

రాజధాని ఉద్యమంతో….

ఇక ఎస్సీ వ‌ర్గానికి చెందిన కొల‌క‌లూరి శ్రీనివాస‌రావు అమ‌రావ‌తి జేఏసీ ఉద్య‌మంతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యారు. ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్లో బీజేపీ నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డిని చెప్పుతో కొట్ట‌డంతో సంచ‌ల‌నం అయ్యింది. ఇక రాజ‌ధాని ఏరియాల్లో కొల‌క‌లూరి శ్రీనివాస‌రావు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కూడా వైసీపీని ఓడించాల‌ని ప్ర‌చారం చేశారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడికొండ నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం చేసే ఉద్దేశంతోనే కొల‌క‌లూరి శ్రీనివాస‌రావు త‌న నివాసాన్ని రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న కృష్ణాయ‌పాలెంకు మార్చేశార‌ని అంటున్నారు. చంద్ర‌బాబుతో ట‌చ్‌లో ఉండ‌డంతో పాటు ఆయ‌న డైరెక్ష‌న్‌లో న‌డుస్తున్నారంటూ స్తానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

శ్రవణ్ ను కాదని…

అయితే ప్రస్తుతం తాడికొండ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్ర‌వ‌ణ కుమార్ ఉన్నారు. అయితే బ‌య‌ట ప్ర‌చారం మాత్రం చంద్ర‌బాబు కొల‌క‌లూరి శ్రీనివాస‌రావుకు ఎమ్మెల్యే సీటుపై హామీ ఇచ్చేశార‌ని జ‌రుగుతోంది. అయితే శ్రీనివాస‌రావు విష‌యంలో పార్టీ కేడ‌ర్‌తో పాటు రైతుల్లోనూ అంత స‌ఖ్య‌త లేదు. ఇక్క‌డ ఇన్‌చార్జ్‌గా ఉన్న శ్రవ‌ణ్ కుమార్ గుంటూరు పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. పైగా ఎంపీ జ‌య‌దేవ్‌కు అత్యంత స‌న్నిహితుడు. శ్రీనివాస‌రావు విషయంలో పార్టీలోనే కొంద‌రిలో స‌ఖ్య‌త లేదు. అలాంట‌ప్పుడు చంద్ర‌బాబు ఏ ఉద్దేశంతో ఆయ‌న‌కు తాడికొండ సీటుపై హామీ ఇచ్చార‌న్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.

శ్రవణ్ ను ప్రత్తిపాడుకు….?

గ‌త ఎన్నిక‌ల్లోనే తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్ర‌వ‌ణ్‌ను స్థానికంగా కొంద‌రు నేత‌లు వ్య‌తిరేకించార‌ని.. బాప‌ట్ల ఎంపీ సీటుకు మార్చారు. బాప‌ట్ల ఎంపీగా ఉన్న శ్రీరామ్ మాల్యాద్రికి తాడికొండ ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అయితే జ‌య‌దేవ్ ఒత్తిడితో బాబు మ‌రుస‌టి రోజు మ‌ళ్లీ శ్ర‌వ‌ణ్‌కు తాడికొండ సీటు ఇచ్చారు. ఇప్పుడు పార్టీలో సీనియ‌ర్‌గా ఉన్న శ్ర‌వ‌ణ్‌ను తాడికొండ నుంచి ఎలా ? త‌ప్పిస్తార‌న్న సందేహాలు ఉన్నాయి. అయితే గుంటూరు న‌గ‌రాన్ని ఆనుకునే ఉన్న ప్ర‌త్తిపాడుకు శ్ర‌వ‌ణ్‌ను పంపిస్తార‌ని మ‌రో టాక్ ? కొల‌క‌లూరి శ్రీనివాస‌రావుకు తాడికొండ సీటు ఇస్తారంటున్నారు ఈ రెండు ఎస్సీ సీట్ల‌ను ఈ ఇద్ద‌రికి కేటాయిస్తార‌ని పార్టీలో చ‌ర్చ అయితే జ‌రుగుతోంది.

Tags:    

Similar News