కొణతాల స్విచ్ ఆన్ చేశారట

విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురించి మళ్ళీ జోరుగా ప్రస్తావన వస్తోంది. గత ఏడాది టీడీపీలో చేరిన ఆయన ఆ పార్టీ [more]

Update: 2020-04-16 03:30 GMT

విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురించి మళ్ళీ జోరుగా ప్రస్తావన వస్తోంది. గత ఏడాది టీడీపీలో చేరిన ఆయన ఆ పార్టీ ఓడిపోవడంతో పూర్తిగా ఏకాంతవాసాన్ని ఎంచుకున్నారు. అయితే ఇపుడు మళ్ళీ తనదైన రాజకీయాన్ని మొదలుపెట్టారని అంటున్నారు. కొణతాల రామకృష్ణ చూపు అధికార పార్టీ మీద పడిందని అంటున్నారు. ఆయన పాత పరిచయాలను పునరుద్ధరించుకుంటున్నారు. ఫ్యాన్ నీడకు చేరేందుకు రంగం సిధ్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.

విజయసాయితో అలా….

విశాఖ జిల్లా రాజకీయాల వరకూ చూస్తే జగన్ కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి అక్కడ అన్నీ చక్కబెడుతూంటారు. ఈ ఎంపీ గారే అయారాం గయారాం వ్యవహారాలను చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలతో రాయబేరాలు కూడా వైసీపీ పెద్దలు చేస్తున్నరంటే దాని వెనక విజయసాయి ఉన్నారని అంటున్నారు. పనిలో పనిగా పాతకాలం నాటి వైసీపీ నేతలను కూడా వైసీపీ వైపుగా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగానే కొణతాల రామకృష్ణ విజయసాయిరెడ్డికి టచ్ లోకి వచ్చారని అంటున్నారు.

విరాళాల‌తో మొదలా….

నిజానికి సాంకేతికంగా చూసుకుంటే కొణతాల రామకృష్ణ కుటుంబం టీడీపీలో ఉన్నట్లుగా చెప్పాలి. అయితే టీడీపీ వారు పెద్దగా విరాళాలు ఇచ్చినది లేదు. కానీ కొణతాల కుటుంబం మాత్రం కరోనా విపత్తుకు పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఆ విరాళాన్ని ఏకంగా విజయసాయిరెడ్డికి అందించింది. తన తమ్ముడు, సీనియర్ నేతగా ఉన్న రఘునాధబాబుని విజయసాయి వద్దకు కొణతాల రామకృష్ణ పంపార‌ని అంటున్నారు. ఇది వైసీపీ మీద కొణతాలకు ఉన్న సానుకూల సంకేతంగా చెబుతున్నారు. నిజానికి విరాళం ఇవ్వాలనుకుంటే కలెక్టర్ ని స్వయంగా కలసి ఇవ్వవచ్చు. ఇలా ఎంపీ చేతికి చెక్కుని స్వయంగా అందించడం అంటే అందులో వేరే రాజకీయం ఉందని అంటున్నారు.

చేరిక ఖాయమే…..

కొణతాల రామకృష్ణకు ఇపుడు వేరే ఆప్షన్ లేదు. ఆయన రాజకీయంగా పదేళ్ళుగా ఏకాంతవాసం చేస్తున్నారు ఇప్పటికే ఆయన అనుచర వర్గం కూడా చెల్లాచెదురైంది. జిలాల్లో కూడా ఆయన్ని మరచిపోయే పరిస్థితి ఏర్పడింది. అటువంటిది ఇపుడైనా అధికార పార్టీలో చేరితేనే విలువ ఉంటుందని అనుచరులు గట్టిగా వత్తిడి తెస్తున్నారుట. దాంతో కొణతాల రామకృష్ణ మళ్ళీ ఫ్యాన్ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. రానున్న నాలుగేళ్ళలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉంటుంది. ఆ తరువాత కూడా టీడీపీ వస్తుందా అంటే చెప్పలేని స్థితి. అందుకే ముందు జాగ్రత్తగా కొణతాల పాత పార్టీనే నమ్ముకున్నారని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News