ఈసారి ఖచ్చితమైన గెలుపు ఈయనదేనట

ఇప్పడిప్పుడే తెలుగుదేశం పార్టీ నేతలు బయటకు వస్తున్నారు. మరో ఆప్షన్ లేకపోవడం, ఎన్నికలకు మూడేళ్లు మాత్రమే సమయం ఉండటంతో టీడీపీ నేతలు జనం బాట పడుతున్నారు. ఈసారైనా [more]

Update: 2021-08-13 13:30 GMT

ఇప్పడిప్పుడే తెలుగుదేశం పార్టీ నేతలు బయటకు వస్తున్నారు. మరో ఆప్షన్ లేకపోవడం, ఎన్నికలకు మూడేళ్లు మాత్రమే సమయం ఉండటంతో టీడీపీ నేతలు జనం బాట పడుతున్నారు. ఈసారైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వరసగా గెలిచిన చోట ఈసారి తమకు సానుభూతి అయినా పనిచేస్తుందన్న ఆశతో టీడీపీ నేతలున్నారు. వారిలో మాజీ మంత్రి కొండ్రు మురళి ఒకరు.

పదిహేనేళ్ల క్రితం….

రాజాం నియోజకవర్గానికి కొండ్రు మురళి ప్రాతినిధ్యం వహించి పదిహేనేళ్లవుతుంది. రేపు ఎన్నికలు జరిగే సమయానికి పదిహేనేళ్లు ఎమ్మెల్యే పదవికి కొండ్రు మురళి దూరంగా ఉన్నట్లవుతుంది. ఈ ఒక్క సానుభూతి తనకు చాలన్నట్లు కొండ్రు మురళి భావిస్తున్నారు. 2009లో రాజాం నియోజకవర్గం నుంచి కొండ్రు మురళి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత గెలుపు పిలుపునే కొండ్రు మురళి అందుకోలేకపోయారు.

సానుభూతి పనిచేస్తుందని….

గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి మారి పోటీ చేసినా ప్రజలు ఆదరించలేదు. ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు (2014, 2019) ఎన్నికల్లో వరసగా విజయం సాధించిన కంభాల జోగులుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ క్యాడర్ నుంచే ఆయనకు భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఇది తనకు అనుకూలంగా మారుతుందని కొండ్రు మురళి భావిస్తున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకతతో పాటు, తనపై ఉన్న సానుభూతితో ఈసారి విజయం తనదేనన్న ధీమాలో మురళి ఉన్నారు.

టీడీపీలోనే ఉండి…..

కొండ్రు మురళి కొంతకాలం క్రితం వరకూ వైసీపీలో చేరాలని ప్రయత్నించినా ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారు. పార్టీ కంటే తనను చూసే ఓటేస్తారు కాబట్టి టీడీపీలోనే ఉండేందుకు ఆయన ఇష్టపడుతున్నారు. ఇక్కడైతేనే టిక్కెట్ గ్యారంటీ. వైసీపీలోకి వెళితే టిక్కెట్ దక్కడం కష్టం. అందుకే కొండ్రు మురళి టీడీపీ ఇచ్చిన పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్నమొన్నటి వరకూ పార్టీలో సైలెంట్ గా ఉన్న కొండ్రు మురళి యాక్టివ్ కావడం ఈసారి గెలుపుతనదేనన్న ధీమాయేనని అంటున్నారు.

Tags:    

Similar News