టీడీపీలో ఇమడలేరట
ఆయన యువ నాయకుడు, ఎస్సీ వర్గానికి చెందిన నేత. గతంలో కిరణ్‌కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అయితే, ప్రస్తుతం ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఎదురు [more]
ఆయన యువ నాయకుడు, ఎస్సీ వర్గానికి చెందిన నేత. గతంలో కిరణ్‌కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అయితే, ప్రస్తుతం ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఎదురు [more]
ఆయన యువ నాయకుడు, ఎస్సీ వర్గానికి చెందిన నేత. గతంలో కిరణ్‌కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అయితే, ప్రస్తుతం ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనే శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్. కాంగ్రెస్ హయాంలో 2009లో ఇక్కడ నుంచి విజయం సాధించిన కోండ్రు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కూడా చక్రం తిప్పారు. అయితే, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో సీనియర్లు అందరూ పార్టీలు మారినా కోండ్రు మురళి మాత్రం అదే పార్టీలో ఉన్నారు.
టీడీపీలో చేరినా….
కాంగ్రెస్ టైంలో 2004లో ఎచ్చెర్ల నుంచి 2009లో రాజాం నుంచి గెలిచిన కోండ్రు మురళి మంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతోనే ఢీ అంటే ఢీ అనేలా ఉండేవాడన్న పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్న కోండ్రు మురళి ఇక, ఆ పార్టీలో ఉంటే ప్రయోజనం లేదని భావించి అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ.. మాజీ స్పీకర్ ప్రతిభాభారతి వంటివారు పోటీలో ఉన్నప్పటికీ.. చాకచక్యంగా చంద్రబాబును మెప్పించి టికెట్ తెచ్చుకున్నారు.
తన ఓటమికి కారణం…?
అయితే, జగన్ సునామీలో ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి కూడా కోండ్రు మురళి పార్టీ తరపున కానీ, బయటకు కానీ రావడం లేదు. పైగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఫైట్ చేస్తుంటే కోండ్రు మురళి మాత్రం మూడు రాజధానులను స్వాగతించారు. అంతేకాదు, తాను స్వయంగా చంద్రబాబును ఒప్పిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ నేతలు కోండ్రు మురళిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. పైగా కోండ్రులోనూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుపై గుస్సా ఉంది. రాజాం కళాకు సొంత నియోజకవర్గం కావడంతో కావాలనే ఆయన తనను ఓడించారని కోండ్రు మురళి భావిస్తున్నారు.
బీజేపీ నుంచి ఆహ్వానం ఉన్నా….
ఈ క్రమంలోనే ఆయన ఇక టీడీపీలో ఇమడలేనని నిర్ణయించుకున్నట్టు సమా చారం. ఇదిలావుంటే, బీజేపీ రాష్ట్ర సారధి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కోండ్రు మురళికి ఫోన్ చేసి బీజేపీలో చేరాలని కోరారట. అయితే, కోండ్రుకు మాత్రం మనసంతా వైసీపీవైపే ఉందని తెలుస్తోంది. ఈ పార్టీలో ఉంటే ఎదుగుదల ఉంటుందని, బీజేపీలోకి వెళ్లే.. ఏ బూడిదా ఉండదని భావించి ప్రస్తుతానికి వైసీపీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారట. ఏ క్షణాన వైసీపీ నుంచి పిలుపు వచ్చి ఎగిరిపోతే ఎంతబావుంటుంది.. అన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారన్నదే శ్రీకాకుళం జిల్లాలో వినిపిస్తోన్న తాజా టాక్.