రెడీ అయిపోయారు.. డేట్ ఎప్పుడనేదే?

టీడీపీ నేత కొండ్రు మురళిమోహన్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన గత కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా లేరు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత [more]

Update: 2020-08-15 03:30 GMT

టీడీపీ నేత కొండ్రు మురళిమోహన్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఆయన గత కొద్దికాలంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా లేరు. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత కొండ్రు మురళి రాజాం నియోజకవర్గం వైపు కూడా తొంగిచూడటం లేదు. ఎక్కువగా హైదరాబాద్, విశాఖపట్నంలోనే గడుపుతున్నారు. కొండ్రుమురళి వైసీపీ లో చేరతారన్న టాక్ బలంగా విన్పిస్తుంది. విశాఖకు పరిపాలనా రాజధాని తరలి రాగానే కొండ్రు మురళి వైసీపీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి…..

కాంగ్రెస్ లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండ్రు మురళి 2009 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి గెలిచారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలను కూడా చేపట్టారు. 2009లో వైఎస్ మరణం తర్వాత ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2014లోనూ కాంగ్రెస్ లోనే ఉన్నారు. వైసీపీలోకి వద్దామనుకున్నా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంభాల జోగులు ఉండటంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు.

దారుణ ఓటమికి కారణం….

కానీ 2019 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళి దారుణ ఓటమిని చవిచూశారు. పదిహేడు ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఇందుకు టీడీపీ నేతలు సహకరించకపోవడం వల్లనేనని ఆయన అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. రాజాం నియోజకవర్గంలో పట్టున్న ప్రతిభా భారతి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వర్గాలు వైసీపీకి సహకరించడంతోనే తన ఓటమికి కారణమని కొండ్రు మురళి హైకమాండ్ కు ప్రత్యేకంగా ఆధారాలతో సహా నివేదికను కూడా సమర్పించారు.

వైసీపీలో చేరేందుకు….

కానీ అధిష్టానం కనీసం వారిని వివరణ అడిగే ప్రయత్నం కూడా చేయకపోవడంతో కొండ్రు మురళి మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. విశాఖకు పరిపాలన రాజధానిని తేవడాన్ని కూడా కొండ్రు మురళి బహిరంగంగానే సమర్థించారు. ఆ తర్వాత నుంచి కన్పించడం మానేశారు. అయితే కొండ్రు మురళి వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటయిన వెంటనే కొండ్రు మురళి బేషరతుగా వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. వైసీపీలో చేరితే ఆయన భవిష్యత్ ఏమిటన్న దానిపై ఇంకా కొండ్రు మురళి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News