ఆ వైసీపీ ఎంపీ పై ఆ స్టాంప్ పడింది
బొత్తిగా తిని తొంగుంటే.. మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది!- ఇది సినిమాలో డైలాగే అయినా.. జీవితానికి అన్వయించుకుంటే.. చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. బహుశ ఆ [more]
బొత్తిగా తిని తొంగుంటే.. మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది!- ఇది సినిమాలో డైలాగే అయినా.. జీవితానికి అన్వయించుకుంటే.. చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. బహుశ ఆ [more]
బొత్తిగా తిని తొంగుంటే.. మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది!- ఇది సినిమాలో డైలాగే అయినా.. జీవితానికి అన్వయించుకుంటే.. చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. బహుశ ఆ ఎంపీ ఈ డైలాగునే తన జీవితానికి అన్వయం చేసుకుని ఉంటారు. నాయకుడన్నాక.. ఏదో గెలిచాం.. ఏదో చేశాం.. అని సరిపెట్టుకోలేదు. త నకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకోవాలని అనుకున్నారు. తన నియోజవకర్గానికి.. తద్వారా తన దేశానికి మొ త్తం ఈ సమాజానికి తన చర్యల వల్ల మంచి జరగాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే స్వచ్ఛ భారత్‌లో భా గంగా.. ప్లాస్టిక్‌పై పోరుకు ఆయన నడుం బిగించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం….
మనసు ఉండాలే కానీ, మార్గం ఉండదా? అన్న చందంగా ఆ ఎంపీ అనుకున్న ప్లాస్టిక్ రహిత సహాజ స్థాప నను ఎవరికో పురమాయించి తను తీరుబడిగా దీనిని పర్యవేక్షించలేదు. తానే నడుం బిగించి ముందుకు దూకారు. మార్పు తన నుంచే ప్రారంభం కావాలని అనుకున్నారు. ప్లాస్టిక్ వల్ల సమాజానికి జరుగుతున్న చెడును, భవిష్యత్ తరాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా తన వద్దకు వచ్చే వారికి వివరిస్తున్నారు. అదేసమయంలో స్వచ్ఛంద సంస్తలను కలుపుకొని పోతూ.. ప్టాస్టిక్ రహిత సమాజ స్థాపన దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఆయనే దివంగత మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు, ఏలూరు ఎంపీ, వైసీపీ యువ నాయకుడు కోటగిరి శ్రీధర్.
వాటిని తీసుకోనని….
కోటగిరి శ్రీధర్ ఎంపీ కావడంతో ఆయన వద్దకు నిత్యం అనేక మంది సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ఎందరో వచ్చి ఆయనను కలుస్తుంటారు. సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం.. ఆయనను కలవడానికి వచ్చినవారు ఏ బొకేనో.. మరేదో గిఫ్టో ఇస్తుంటారు. అయితే, వీటికి ప్లాస్టిక్.. కవర్ చుట్టి ఉంటుంది. దీంతో ఇలాంటి వాటిని తాను స్వీకరించబోనని, పైగా బొకే వల్ల ఎవరికైనా ఏమైనా లాభం ఉంటుందా? అని కూడా శ్రీధర్ ప్రశ్నిస్తారు. అదే ఏం పండ్లో, పుస్తకాలో.. లేదో మొక్కలో గౌరవంగా ఇస్తే.. వాటి వల్ల అపరిమితమైన మేలు ఉండడం తోపాటు సమాజానికి ఎంతో ప్రయోజనకరంగానూ ఉటుందనేది ఆయన భావన. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ప్లాస్టిక్‌తో ఉన్న బోకే ఇస్తే నిర్మొహమాటంగా ఆయన తిరస్కరిస్తారు.
పుస్తకాలు…పెన్నులే….
దీంతో అప్పటి నుంచి కూడా అధికారులు కానీ, ఎవరైనా కానీ ఎంపీ శ్రీధర్‌ను కలిసేందుకు వెళ్తే.. తమ చేతిలో పుస్తకాలో.. పెన్నులో.. పండ్లో, మొక్కలతోనే కనిపిస్తున్నారు. ఈ తరహా మార్పు వల్ల సమాజంలో పుస్తకాలు లేని పేదలకు, రోగులకు పండ్లు పంచే అవకాశం పరోక్షంగా సమజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందనేది ఎంపీ కోటగిరి శ్రీదర్ దూరదృష్టికి నిదర్శనం. అయితే, నీతులన్నీ ఎదుటివారికి చెప్పేందుకే ఉంటాయి! అనే నానుడి ఒకటి ఉంటుంది. తన దాకా వస్తే.. కూడా ఇలానే చేస్తారా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. నిజమే! ఎంపీ శ్రీధర్ విషయానికి వస్తే.. ఆయన ఇంటికి వచ్చే వారికి ఇచ్చే టీ కానీ, కాఫీ కానీ, ఆఖరుకు తాగునీరు కానీ పేపర్ గ్లాసులు, పేపర్ ప్లేట్లలోనే సర్వ్ చేసేలా చర్యలు తీసుకున్నారు.
మొక్కల పెంపకంపై….
అదేవిధంగా మొక్కల పెంపకానికి ప్రత్యేకంగా వింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తాను ఎవరిని కలిసినా.. ఓ మొక్కను గౌరవంగా ఇస్తున్నారు. అంతేకాదు, ఈ ప్రయత్నం తన వరకే పరిమితం చేసుకోలేదు. తన నియోజకవర్గానికి కూడా పాకించారు. తన నియజకవర్గంలో ఎక్కడ ఎలాంటి శుభ కార్యం జరిగినా.. ప్లాస్టిక్ రహితంగా ఉండేలా చూసుకోవాలని పిలుపు ఇస్తున్నారు. ఫంక్షన్లలో వినియోగించే ప్లాస్టిక్ గ్లాసులు చెంచాల స్థానంలో పేపర్‌తో తయారైన వాటినే వినియోగించాలని సూచిస్తున్నారు. అవసరమైతే.. తాను కూడా ఆ ఖర్చులో కొంత మొత్తం ఇస్తానని చెబుతున్నారు.
ప్లాస్టిక్ పై పోరు…..
ఇదే విషయాన్ని స్వచ్ఛంద సంస్థలకు చెప్పి వారిని కూడా ఈ ప్లాస్టిక్‌పై పోరులో భాగం చేస్తున్నారు. అదే సమయంలోనియోజకవర్గంలోని వ్యాపార సముదాయాలు, దుకాణాల వారిని కూడా ప్లాస్టిక్ రహితంగా ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. కవర్ల వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ఇలా.. నాయకుడన్నాక.. ఊరికే ఎంత రాబడి.. ఎంత ఖర్చు.. అనే జమా ఖర్చులే చూసుకోకుండా.. సమాజానికి మన వల్ల ఏం జరిగిందనే విషయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ అత్యంత ఆదర్శంగా అడుగులు వేస్తుండడం గమనార్హం