పట్టాభిషేకం దగ్గర పడినట్లుందే?
త్వరలో తెలంగాణలో ముఖ్యమంత్రి మారేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా…? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న స్లోగన్ నెమ్మదిగా [more]
త్వరలో తెలంగాణలో ముఖ్యమంత్రి మారేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా…? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న స్లోగన్ నెమ్మదిగా [more]
త్వరలో తెలంగాణలో ముఖ్యమంత్రి మారేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా…? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న స్లోగన్ నెమ్మదిగా మొదలై ఇప్పుడు మరింత ఊపందుకోవడం ఆ విషయాన్నే సూచిస్తుంది. గులాబీ పార్టీ లోని అగ్రనేతలు అంతా ఇప్పటికే కేటీఆర్ సిఎం కావాలంటూ పబ్లిక్ గ్గానే వ్యాఖ్యలు చేస్తు ప్రజల్లోకి పార్టీ శ్రేణుల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. కారు పార్టీ లోని ప్రధమ శ్రేణి నాయకత్వం ఇస్తున్న సమాచారం తో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు పదేపదే న్యూ సీఎం త్వరలోనే అని పేర్కొంటుంది.
పరీక్షలు పాస్ అయితేనే…
కేటీఆర్ తనకు సొంత కుమారుడే అయినా కేసీఆర్ అందరిని కాదని పెద్దపీట వేసేరకం కాదు. ఏపీలో టిడిపి అధినేత చంద్రబాబు తరహాలో కొడుకును ప్రజల నుంచి కాకుండా షార్ట్ కట్ లో ఎమ్మెల్సీని తరువాత మంత్రిగా చేసే రకం కాదు. గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయని పదవి అలంకార ప్రాయం కాదు ముళ్ల కిరీటం అనే భావించేవిధంగా ఉగ్గుపాలతో కేటీఆర్ నేర్చుకునేలా శిక్షణ ఇచ్చారు. ముందుగా తెలంగాణ ఉద్యమం లో తనయుడిని దింపి అధికారపక్షంపై పోరాటాలు నేర్పారు. ఈ క్రమంలో కేసులు జైళ్లు అన్ని రుచి చూపించారు. తన కుటుంబ కష్టానికి తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మబలిదానాలతో ఏర్పడిన రాష్ట్రానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దశల వారీగానే తమవారికి ఆ ఫలాలు అందించే ప్రయత్నం విజయవంతంగా చేశారు. గత హైద్రాబాద్ స్థానిక ఎన్నికల బాధ్యత కేటీఆర్ కి అప్పగించి పరీక్ష పెట్టారు.
లోకేష్ తో పోలికే లేదని నిరూపించి…
రాజకీయం అంటే రెడీ మేడ్ లా ఉండదని, వారసత్వంగా అవకాశం వచ్చి సత్తా లేకపోతే చతికిల పడతామని కేసీఆర్ కి తెలుసు. అందుకే హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలుకుని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కేటీఆర్ నెత్తిపై పలు బాధ్యతలు ఉంచారు కేసీఆర్ తనపై పెట్టిన అన్ని పరీక్షలను విజయవంతం గా పూర్తి చేశారు కేటీఆర్. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి తరపున లోకేష్ బాధ్యతలు వహించి ఫెయిల్ ఆయితే కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఆ తరువాత లోకేష్ ఏ ఎన్నికలకు పార్టీ బాధ్యత తీసుకోలేదు అలాగే చంద్రబాబు ఇచ్చింది లేదు. నాటి ఎన్నికల తరువాత సినిమా అర్ధం అయ్యి చినబాబు తన మకాం అమరావతికి మార్చేశారు. ఇటీవల మంగళగిరిలో ఘోర పరాజయం మూటగట్టుకుని బాబు వారసత్వానికి మచ్చ తెచ్చారు.
పార్టీ బాధ్యతలు అందుకే…
దశలవారీగా కేటీఆర్ ను పరీక్షించిన గులాబీ బాస్ ఎన్నికల అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి చూశారు. అందులో కూడా ఆయన పనితీరు ఒకే అన్న సంతృప్తి ఏర్పడ్డాక ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. తన తండ్రి మరో పదేళ్ళు సిఎం గా ఉంటారని కేటీఆర్ ఇటీవల చెబుతూ వస్తున్నా రానున్న నాలుగేళ్ళు కుర్చీ లో కొడుకును చూసుకోవాలన్నది కేసీఆర్ ఆశగా ప్రచారం నడుస్తుంది. పక్క రాష్ట్రంలో వైఎస్ కుమారుడు ఒంటిచేత్తో వైసిపిని అధికారంలోకి తేవడం సమర్ధంగా అటు పార్టీని, ప్రభుత్వాన్ని నడపడం కేసీఆర్ ను ఆకట్టుకుంది. కేటీఆర్ కూడా అలాగే రాణిస్తారన్న నమ్మకం మెండుగా ఉండటం తో పట్టాభిషేకం చేసేందుకు కారు అధినేత సిద్ధం అయ్యారని తెలుస్తుంది. గులాబీ బాస్ మనసులో ఏముందో గ్రహించే దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు భజన ముందుగా అందుకున్నట్లు తెలుస్తుంది.
కేసీఆర్ ఏం చేయబోతున్నారు…?
పదవి నుంచి వైదొలిగాక కేసీఆర్ ఏమి చేస్తారనే అంశం పైనా జోరుగా చర్చ నడుస్తోంది. తన ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రం లో పుస్తక పఠనం, రచనలు చేయడం ప్రధానంగా కేసీఆర్ చేయనున్నట్లు చెబుతున్నారు. అలాగే కేంద్ర రాజకీయాల్లో గులాబీ పార్టీ కీలక పాత్ర పోషించేందుకు ఆయన వ్యూహ రచన చేయనున్నారని జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఉనికిని చాటే బాట వేయనున్నారని టీఆర్ఎస్ శ్రేణుల్లో టాక్.