జగన్ ఆలోచన కూడా అదే

తెలుగు ప్రజల ఐక్యతతో, ఎక్కువ స్థానాలు సాధించి యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలనే ఆలోచనతోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉన్నారని టీఆర్ఎస్ [more]

Update: 2019-01-18 13:01 GMT

తెలుగు ప్రజల ఐక్యతతో, ఎక్కువ స్థానాలు సాధించి యాచించే స్థాయిలో కాకుండా శాసించే స్థాయిలో ఉండాలనే ఆలోచనతోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఉన్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ… కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితులు బాగలేవని, రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు సాధించే అవకాశం లేదన్నారు. యూపీలో బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి ఏర్పడిందని, ఒడిశాలో కూడా నవీన్ పట్నాయక్ ఇద్దరికీ వ్యతిరేకంగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలంగా దేశ రాజకీయ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం సమాఖ్య స్ఫూర్తితో వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.

అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే…

36 ఏళ్ల వైరాన్ని పక్కనపెట్టి, తిట్టుకున్న తిట్లన్నీ మరిచిపోయి కేసీఆర్ ని ఓడించాలనే ఒకే లక్ష్యంతో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. అదే దేశ రాజకీయాల్లో మంచి మార్పు రావాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తే అక్కసుతో చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మీదకు గద్దల్లా వస్తున్నామని అంటున్నారని, నాలుగున్నరేళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో సంసారం చేసిన గద్దలు ఎవరని ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నరేంద్ర మోదీని, కేసీఆర్ ను చంద్రబాబు బూచీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీడియాలో ఎన్నిరకాలుగా చంద్రబాబును చూపించిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ప్రజలుగా కలిసే ఉందాం…

ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసే ఉందామని మొదటి నుంచీ టీఆర్ఎస్ చెబుతుందన్నారు. అన్నాదమ్ములుగా వీడిపోదాం… అభివృద్ధిలో పోటీ పడదామని చెప్పామన్నారు. తాము ఎప్పుడూ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో మాటలు అన్నామని, అదే విధంగా మాటలు పడ్డామని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగాక అన్నీ మరిచిపోయి రాగద్వేషాలు, ప్రాంతీయ భేదాలు లేకుండా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. అందుకే తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్ర మిత్రులు కేసీఆర్ కి ఓట్లేసి గెలిపించారని పేర్కొన్నారు. పాలనలో విఫలమైన చంద్రబాబు… తన అసమర్థతను దాచిపెట్టి కేసీఆర్, మోదీని బూచీగా చూపించి ఓట్లడుతున్నారన్నారు.

Tags:    

Similar News