చేజేతులా చేసుకుంటున్నారా?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన తండ్రి స్థాపించిన జనతాదళ్ ఎస్ ను భూస్థాపితం చేసే వరకూ నిద్రపోయేటట్లు లేదు. ఒక వ్యూహం… భవిష్యత్ కార్యాచరణ కుమారస్వామికి [more]

Update: 2019-11-05 17:30 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన తండ్రి స్థాపించిన జనతాదళ్ ఎస్ ను భూస్థాపితం చేసే వరకూ నిద్రపోయేటట్లు లేదు. ఒక వ్యూహం… భవిష్యత్ కార్యాచరణ కుమారస్వామికి లేదు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే ఓపిక లేదు. ఎంతసేపటికీ రిలాక్స్ మూడ్ లోనే ఉందామన్నది కుమారస్వామి భావన. పదిహేను శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కుమారస్వామి వ్యాఖ్యలు సొంత పార్టీలోనూ కలకలం రేపుతున్నాయి.

మధ్యంతర ఎన్నికలు జరిగితే…..

కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కుమారస్వామి చెప్పినట్లు మధ్యంతర ఎన్నికలు జరిగితే త్రిముఖ పోటీ ఖాయం. అప్పుడు కుమారస్వామికి చెందని జనతాదళ్ ఎస్ కనీస స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఎవరికీ పూర్తి స్థాయి మెజారిటీ రాదన్నది కుమారస్వామి అభిప్రాయం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీకి సహకారం అందించాల్సిన అవసరం ఉందని కూడా కుమారస్వామి అన్నారు.

తప్పుడు సంకేతాలు….

కుమారస్వామి వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ లో తప్పుడు సంకేతాలు పంపాయి. జేడీఎస్ కు ఓటేసినా బీజేపీ, కాంగ్రెస్ కు ఓటేసినట్లేనన్న అభిప్రాయం వెళ్లిపోతుందన్న కనీస అవగాహన కూడా కుమారస్వామిలో కొరవడిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుమారస్వామి పట్ల ఆగ్రహంతోనూ, అసహనంతోనూ ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్సీ పుట్టప్ప సయితం తాను జేడీఎస్ ను వీడుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు.

ఇక ఓట్లు ఎందుకు వేయాలి?

అందువల్లనే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కుమారస్వామి బీజేపీకి మద్దతిస్తే ఇక మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఏముంటుందన్నదీ ప్రశ్న. తనపై నమోదయిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి బయటపడేందుకు, తన పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూడకుండా ఉండేందుకే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ పదిహేను శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందంటున్నారు సొంత పార్టీ నేతలు.

Tags:    

Similar News