Bihar : లాలూ టార్గెట్ అదే…. నిలువరించగలరా?

బీహార్ రాజకీయాలను మరోసారి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శాసించనున్నారు. ఆయన దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన తిరిగి బీహార్ రాజకీయాల్లో యాక్బివ్ అవుతున్నారు. వచ్చే [more]

Update: 2021-11-03 16:30 GMT

బీహార్ రాజకీయాలను మరోసారి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శాసించనున్నారు. ఆయన దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన తిరిగి బీహార్ రాజకీయాల్లో యాక్బివ్ అవుతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీహార్ లో సత్తా చాటాలన్నది ఆయన ప్రయత్నంగా కన్పిస్తుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బీహార్ లో ఆర్జేడీ అత్యధిక స్థానాలను సాధించి తిరిగి కేంద్రంలో కీలక భూమిక పోషించాలన్నది లాలూ ప్రసాద్ యాదవ్ యత్నంగా కన్పిస్తుంది.

తిరుగులేని నేతగా…

లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో తిరుగులేని నేత. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించి ఆయన బీహార్ లో పార్టీని అనేకసార్లు అధికారంలోకి తేగలిగారు. ఆయన సామాన్యులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో పేద ప్రజల నుంచి మధ్య తరగతి వరకూ ఓన్ చేసుకున్నారు. అలాంటి లాలూ ప్రసాద్ యాదవ్ 2015 ఎన్నికల్లోనూ కూటమిని అధికారంలోకి తేగలిగారు. తర్వాత ఆ ప్రభుత్వం వివిధ కారణాలతో కూలిపోయిన సంగతి తెలిసిందే.

జైలుకు వెళ్లి…

తర్వాత పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలు కెళ్లడంతో బీహార్ రాజకీయాలకు దూరమయ్యారు. 20220 ఎన్నికలు ఆయన లేకుండానే జరిగాయి. ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ సారధ్యంలో కూటమి గెలుపు అంచెలుదాకా వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థానాల్లో గెలవలేకపోవడంతో లాలూ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి చేజారి పోయింది.
అయినా ఆర్జేడీ బీహార్ లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది.

పార్లమెంటు ఎన్నికల్లో….

బీహార్ లో 40 పార్లమెంటు స్థానాలున్నాయి. ఈ పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలను ఆర్జేడీ గెలుచుకోవడమే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ముందున్న టార్గెట్. ఫలితంగా బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలోకి రానివ్వకుండా చూడాలన్నది ఆయన ఆలోచన. తనను అన్యాయంగా జైలుకు పంపిన బీజేపీని నిలువరించాలన్న ధ్యేయంతోనే ఆయన అడుగులు ఉండనున్నాయి. ఆ దిశగానే లాలూ ప్రసాద్ యాదవ్ భవిష‌్యత్ కార్యాచారణ ఉండబోతుంది. లాలూ యాక్టివ్ కావడంతో ఆర్జేడీ క్యాడర్ లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కన్పిస్తుంది.

Tags:    

Similar News