లాక్ డౌన్ ఎత్తివేయకున్నా….సహజీవనమే బెటర్ అంటున్నారే?

కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు. ఈ మాట మొట్టమొదటిగా అన్నది ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలను విపక్షాలు చేశాయి [more]

Update: 2020-05-29 17:30 GMT

కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు. ఈ మాట మొట్టమొదటిగా అన్నది ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలను విపక్షాలు చేశాయి కూడా. అయితే ఇప్పుడు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనా తో సహజీవనం తప్పదని దేశాధినేతలు పలువురు పేర్కొన్నారు. ఇక బతికి ఉంటే బలుసాకు తినొచ్చన్న తెలంగాణ ముఖ్యమంత్రి కరోనా తో సహజీవనం చేయాలిసిందనేనని తేల్చేశారు. ఇక ప్రధాని మోడీ లాక్ డౌన్ 4.0 ప్రకటిస్తూ ఇదే మాట చెప్పేశారు.

రెడ్, ఆరెంజ్ లు వద్దు బాబోయ్ …

కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే భారీగా దేశంలో పెరుగుతున్నాయి. జూన్, జులై లో ఈ కేసుల సంఖ్య మరింత పెరగడం ఖాయం అనే నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధలు సడలించి ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నంలో కేసుల సంఖ్య సైతం అనివార్యంగా పెరగడం ఖాయం అవుతుంది. అయితే పాజిటివ్ కేసులను గతంలో లా కాకుండా హోం క్వారంటైన్ లో ఉంచి మిగిలిన ప్రాంతం ఫ్రీ జోన్ గా ఉంచడమే మంచిదని ప్రజలు సైతం మైండ్ సెట్ మార్చుకునే వాతావరణం కనిపిస్తుంది. రెడ్ జోన్స్ లో ఉండేవారు నిత్యావసరాలకు సైతం బయటకు రాకూడదనే నిబంధనలతో జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇంట్లో దాక్కుని పోరాటం చేయడం అనే విధానం పూర్తి అయిందని ఇప్పుడు నిబంధనలు పాటిస్తూ బయటకు వచ్చి కరోనా వైరస్ పై యుద్ధం చేయడానికి సిద్ధం అయిపోయారు.

ఆదాయానికి భారీగా చిల్లు …

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మూడొంతుల ఆదాయం కరోనా వైరస్ దెబ్బతో ఆవిరి అయిపొయింది. మరోపక్క ప్రజలకు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. దాంతో వీధిలోకి వచ్చే ఉపాధి చూసుకుంటూ పోరాడాలని డిసైడ్ అయిపోయారు. జనం ఆలోచనలకు అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలను సమీక్షిస్తున్నాయి. బస్సు రవాణా, వివిధ రవాణా వాహనాలకు అనుమతులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని రీ ఓపెన్, వ్యాపార సంస్థలను పునః ప్రారంభం చేయడంతో అన్ని కార్యకలాపాలు మొదలు అయిపోయాయి.

ప్రజల్లో భయం పోయింది …

కరోనా వస్తే వస్తుంది మన జాగ్రత్తలు మనం తీసుకుందాం అనే ధోరణి ఇప్పుడు మొదలైంది. మొదట్లో కరోనా వైరస్ పేరు చెప్పగానే జనం భయపడేవారు. కరోనా వైరస్ కి వైద్యం చేసే వారికి అనేక సమస్యలు ఎదురు అయ్యేవి. వారిని ఇళ్ళు ఖాళీ చేయించాలనే స్థాయి నుంచి వైరస్ కట్టడిలో పాల్గొంటున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ పై పూలు జల్లేలా అందరిలో పరిణతి వచ్చింది. మరణాల సంఖ్య దేశంలో బాగా తక్కువగా నమోదు కావడంతో ఆర్ధిక వ్యవస్థ గాడిన పెట్టుకోవడంపైనే ఇప్పుడు సర్కార్ దృష్టి సారించిం వేగం పెంచింది. ఇదిలా ఉంటె ఈనెల 31 తో లాక్ డౌన్ పిరియడ్ ముగింపు కానుండటంతో ఐదవ విడత లాక్ డౌన్ లో మరిన్ని ఆంక్షలు ఎత్తివేస్తూ వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కట్టడికి కఠిన చర్యలను తీసుకోవడం వైద్య పరంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం యోచన చేస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News