పేరు ప్రకటించరట… ఫలితాల తర్వాతే ఏదైనా?
మహాకూటమికి బీహార్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి కరవయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీహార్ లో మహాకూటమి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. బీహార్ లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, [more]
మహాకూటమికి బీహార్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి కరవయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీహార్ లో మహాకూటమి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. బీహార్ లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, [more]
మహాకూటమికి బీహార్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి కరవయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీహార్ లో మహాకూటమి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. బీహార్ లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్దాయి. బీజేపీ, జేడీయూ కలసి కూటమితో బరిలోకి దిగననున్నాయి. ఎన్డీఏ కూటమికి క్లారిటీ ఉంది. నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ కూటమి ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగింది.
సీఎం అభ్యర్థి లేక…
అయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు. ఈ కూటమిలో ఆర్జేడీ బలంగా ఉంది. గత ఎన్నికల్లోనూ ఆర్జేడీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటంతో ఆర్జేడీ బాధ్యతలన్నీ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ చూసుకుంటున్నారు. మరోవైపు లాలూ కుటుంబంలో దీనిపై విభేదాలు తలెత్తాయి. తేజస్వీయాదవ్ కు, సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. తేజ్ ప్రతాప్ యాదవ్ గత లోక్ సభ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి సంచలనం సృష్టించారు.
తేజస్విపై అసంతృప్తి…..
ఈ నేపథ్యంలో మహాకూటమికి తేజస్వి యాదవ్ నాయకత్వం వహించడాన్నే కూటమిలోని పక్షాలు అంగీకరించడం లేదు. మాంఝీ ఇప్పటికే ఇదే కారణంతో బయటకు వెళ్లిపోయారు. అలాగే ఆర్ఎల్ఎస్పీ కూడా ఇదే రీజన్ తో బయటకు వెళ్లి వేరే కూటమిని పెట్టుకుంది. తేజస్వి యాదవ్ నాయకత్వంలో పనిచేసేందుకు ఇష్పం లేకనే మిత్రులు ఒక్కొక్కరిగా బయటకు వెళుతున్నారు. దీంతో మహాకూటమికి నాయకత్వం వహించడానికే తేజస్వి పనికిరాడని మిత్రులే తేల్చారు.
ప్రకటన లేకుండానే…..
ఇక ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమే బెటర్ అన్న ధోరణిలో మహాకూటమి ఉన్నట్లు తెలుస్తోంది. తేజస్వి యాదవ్ పేరును ప్రకటిస్తే ప్రజల్లోనూ వ్యతిరేకిత వస్తుందేమోనన్న ఆందోళన కాంగ్రెస్ లో ఉంది. అందుకే కాంగ్రెస్ పెద్దలు ఈసారి సీఎం అభ్యర్థి పేరును ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. తేజస్వి యాదవ్ కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపై రెండు పార్టీలు కలసి ప్రకటిస్తాయని అంటున్నారు.