ఆ అవుట్ డేటెడ్ లీడర్ ను బాబు అప్ డేట్ చేశారే?
మాకినేని పెదరత్తయ్య. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత. ప్రత్తిపాడు నుంచి వరుసగా గతంలో గెలిచిన నాయకుడు. అయితే, ఈ నియోజకవర్గాన్ని రిజర్వేషన్ కేటగిరీ కింద [more]
మాకినేని పెదరత్తయ్య. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత. ప్రత్తిపాడు నుంచి వరుసగా గతంలో గెలిచిన నాయకుడు. అయితే, ఈ నియోజకవర్గాన్ని రిజర్వేషన్ కేటగిరీ కింద [more]
మాకినేని పెదరత్తయ్య. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత. ప్రత్తిపాడు నుంచి వరుసగా గతంలో గెలిచిన నాయకుడు. అయితే, ఈ నియోజకవర్గాన్ని రిజర్వేషన్ కేటగిరీ కింద ప్రకటించిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మధ్యలో వైసీపీలోకి వెళ్లి వచ్చిన మాకినేని పెద రత్తయ్య కొద్ది రోజులు రాకీయాలకు దూరంగా ఉన్నా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా రాజధాని ఆందోళనల నేపథ్యంలో మాకినేని పెదరత్తయ్య దూకుడు పెంచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా సీనియర్‌గా, మాజీ మంత్రి ఆయనకు గుర్తింపును ఇవ్వడంలో ఎవరూ విమర్శించడం లేదు. అయితే, ఎస్సీ నియోజకవర్గం అయిన ప్రత్తిపాడులో ఆయనను ఇంచార్జ్‌గా నియమించడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి.
అభ్యంతరం తెలుపుతున్న…..
ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా మాకినేని పెదరత్తయ్య నియమాకం అక్కడ హీట్ రాజేసింది. ఆయనను ఇంచార్జ్‌గా వేయడాన్ని లోకల్ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇంచార్జ్ గా నియమించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే చంద్రబాబు దగ్గర తేల్చుకుంటామని పలువురు తమ్ముళ్లు హెచ్చరిస్తు న్నారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గానికి ఓసీని ఇంచార్జ్‌గా ఎలా వేస్తారనేది అందరి ప్రశ్న. బీసీ రిజర్వేషన్లు తగ్గాయని గోల చేస్తున్న చంద్రబాబు…ఓసీని ఎలా ఇంచార్జ్‌గా నియమించారని ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయం చర్చకు దారితీసింది.
రిజర్వ్ నియోజకవర్గంగా మారడంతో…
2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో మాకినేని పెదరత్తయ్య శిష్యుడు కందుకూరి వీరయ్యను పోటీ చేయించగా ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ మరోసారి ఆయనే పోటీ చేయగా మళ్లీ ఓడారు. ఇక 2014 ఎన్నికల్లో మాజీ కేంద్ర సర్వీసుల అధికారి రావెల కిషోర్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. ఇక గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్సీ పదవిని సాధించారు. గత ఏడాది ఎన్నికల సమయంలో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇటీవల రాజధాని పరిణామాలు, మండలి రద్దు నేపథ్యంలో మానసికంగా తనకు రాజకీయాలపై ఆసక్తి పోయిందని ప్రకటించిన ఆయన మండలి పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి కూడా రాజీనామా చేశారు
ఐదుసార్లు గెలిచి….
ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న టాక్ కూడా ఉంది. డొక్కా తప్పుకోవడంతో చంద్రబాబు మాకినేని పెదరత్తయ్యకి అవకాశం ఇచ్చారు. మాకినేని పెదరత్తయ్య గతంలో ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే బాబు మళ్లీ ఆయనకే నియోజకవర్గ కో ఆర్డినేటర్ పగ్గాలు ఇచ్చారు. వాస్తవంగా చూస్తే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు అయినా ఎవరో ఒకరిని ఇక్కడ బాధ్యులుగా పెట్టాలని బాబు భావించినా.. స్థానిక టీడీపీ కేడర్ మాకినేని పెదరత్తయ్య అంటే ముందు నుంచి పడని వ్యతిరేక వర్గం మాత్రం ఆయన్ను వెంటనే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వేళ మాకినేని పెదరత్తయ్య ఈ నిరసనలను ఎదుర్కొని అక్కడ పార్టీని ఎలా గాడిన పెడతారో ? అన్నది చూడాలి.