ఈ ఇద్దరికీ ఆ ఎఫెక్టేనా?

ఇద్దరు రాజకీయ నేతలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నా ఒకే ఒక్క కారణం వారిని పదవులకు దూరం చేసిందనే చెప్పక తప్పదు. తెలంగాణలో వరసగా టీఆర్ఎస్ [more]

Update: 2019-11-16 09:30 GMT

ఇద్దరు రాజకీయ నేతలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నా ఒకే ఒక్క కారణం వారిని పదవులకు దూరం చేసిందనే చెప్పక తప్పదు. తెలంగాణలో వరసగా టీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. కేసీఆర్ తనను నమ్ముకుని వచ్చిన వారికి పదవులు ఇస్తూనే ఉన్నారు. కానీ వారిద్దరికి మాత్రం ఇంతవరకూ పదవులు ఇవ్వకపోవడానికి బలమైన కారణం ఉందంటున్నారు. తన కుమార్తె కవిత నిజామాబాద్ లో ఓటమి పాలు కావడంతోనే కేసీఆర్ ఆ ముఖ్యనేతలను పక్కన పెట్టేశారంటున్నారు.

మండవకు పదవంటూ…

నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే ముందుగా గుర్తుకొచ్చేది మండవ వెంకటేశ్వరరావు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయన అనేక పదవులను అనుభవించారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో టీడీపీ కూడా బలహీనపడటంతో మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరికకు ఓకే చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కవిత విజయానికి కృషి చేశారు.

కేసీఆర్ ను కలిసేందుకు కూడా….

మండవ వెంకటేశ్వరరావు అధికార పార్టీలో చేరడంతో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. ఆ రకమైన ప్రచారం జరిగింది. అయితే నిజామాబాద్ లో కవిత ఓటమి పాలు కావడంతో మండవ వెంకటేశ్వరరావు కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు. నిజామాబాద్ జిల్లాకు కూడా రావడం మానేశారు. కేసీఆర్ తో మండవకు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కవితను గెలిపించుకోలేకపోయానన్న బాధతో ఉన్నారు. దీంతో మండవకు ఇప్పట్లో పదవి దక్కే అవకాశం లేదనే అనిపిస్తోంది. మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సురేష్ రెడ్డికీ ఇదే…..

ఇక ఇదే జిల్లాకు చెందిన మరో నేత కె.ఆర్. సురేష్ రెడ్డి. ఈయన కూడా 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. సురేష్ రెడ్డికి మండలి ఛైర్మన్ పదవి లభిస్తుంద నుకున్నారు. అది భర్తీ కావడంతో రాజ్యసభ దక్కుతుందని ప్రచారం జరిగింది. సురేష్ రెడ్డి విషయంలోనూ కవిత ఎఫెక్ట్ పడిందనే అంటున్నారు. మరోవైపు అదే జిల్లాలో ఉన్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ రాజీనామా చేస్తేనే సురేష్ రెడ్డికి కేసీఆర్ ఆ పదవి ఇస్తారంటున్నారు. మొత్తం మీద సీనియర్ నేతల పదవిపై కవిత ఎఫెక్ట్ పడిందనేది వాస్తవం. ఇప్పుడు పదవి కోసం అడిగే ధైర్యం కూడా వీరిద్దరూ చేయడం లేదు.

Tags:    

Similar News