దూకుడు లేకనే ఆ నేత వెనకబడి పోయారా?

ఉప్పులేని ప‌ప్పు.. దూకుడు లేని రాజ‌కీయాన్ని ఊహించే ప‌రిస్థితి ఉండ‌దు. అందుకే పార్టీల‌తో సంబంధం లేకుండా.. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా కూడా నాయ‌కులు దూకుడు రాజ‌కీ యాలు [more]

Update: 2020-12-01 00:30 GMT

ఉప్పులేని ప‌ప్పు.. దూకుడు లేని రాజ‌కీయాన్ని ఊహించే ప‌రిస్థితి ఉండ‌దు. అందుకే పార్టీల‌తో సంబంధం లేకుండా.. ప్రత్యర్థులు ఎలాంటి వారైనా కూడా నాయ‌కులు దూకుడు రాజ‌కీ యాలు చేస్తుంటారు. అయితే.. ఈ దూకుడు లేక‌పోవ‌డ‌మే.. వైసీపీలోని ఓ కీల‌క నేత‌కు మైన‌స్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అక్కడి సిట్టింగ్ ఎంపీ దివంగ‌త దుర్గాప్రసాద్ కుటుంబానికి జ‌గ‌న్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప‌రిస్థితిలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయినా.. వెంట‌నే దానిని ఇస్తాన‌న్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. గుంటూరుకు చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు జ‌గ‌న్ ఈ హామీ ఇచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటి వ‌ర‌కు అమ‌లు కాలేదు.

సైలెంట్ గానే…

దీంతో ఎప్పుడు ఎమ్మెల్సీల నియామ‌కాలు చేప‌ట్టినా.. ఎన్నిక‌లు జ‌రిగినా.. కూడా ఈ విష‌యం ప్రస్థావ‌న‌కు వ‌స్తూ ఉంటుంది. అలాగే.. ఇప్పుడు కూడా మ‌రోసారి మ‌ర్రి విష‌యం చ‌ర్చకు వ‌చ్చింది. దీనిపై ఇదే జిల్లాకు చెందిన జూనియ‌ర్ నాయ‌కుడు ఒకడు ఆయ‌న స‌ల‌హా ఇచ్చార‌ట‌. దూకుడు పెంచాల్సింది సార్.. దూకుడు లేక‌పోవ‌డం వ‌ల్లే మీరు మైన‌స్ అవుతున్నారు! అని చెప్పార‌ట‌. చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున గతంలో గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు.. ఏకంగా త‌న కుటుంబాన్ని రంగంలోకి దించేశారు. ఆయ‌న స‌తీమ‌ణి వెంకాయ‌మ్మ కూడా దూకుడుగా ముందుకు ఉరికేవారు. కానీ.. అదే స‌మ‌యంలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మాత్రం సైలెంట్‌గా ఉండేవారు.

రేసులో వెనకబడి….

వైట్ కాల‌ర్ పాలిటిక్స్ చేసేవారు. ప్రత్తిపాటి అధికారంలో ఉన్నప్పుడు ఒక‌వైపు ఆ ఫ్యామిలీ దూకుడు రాజ‌కీయాలు.. మ‌రోవైపు మ‌ర్రి రాజశేఖర్ మెత‌క రాజ‌కీయాల‌తో ఆయ‌న రేసులో వెన‌క‌ప‌డ్డారు. ఇదే ప్రత్తిపాటి పుంజుకుని.. వ‌రుస విజ‌యాలు సాధించ‌డానికి కార‌ణ‌మైంది. ఈ గ్యాప్‌ను గుర్తించిన విడ‌ద‌ల ర‌జ‌నీ.. దూకుడును అందిపుచ్చుకుంది. వ్యూహాత్మకంగా పుల్లారావుపై పై చేయి సాధించింది. టీడీపీలో ఉండ‌గానే దూకుడుతో ముందుకు వెళ్లిన ఆమె ఆ త‌ర్వాత వైసీపీలోకి జంప్ చేసిన వెంట‌నే మ‌ర్రిని కాద‌ని మ‌రీ సీటు తెచ్చుకుని పుల్లారావుపై గెలిచింది.

ఆమె మాత్రం….

ఈ దూకుడు ఇంకా కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ కూడా దూకుడు రాజ‌కీయాల‌నే ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడిక‌క్కడ ప్రత్యర్థుల‌ను క‌ట్టడి చేసేందుకు దూకుడుగా ఉండే నాయ‌కుల‌కు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మ‌ర్రి రాజశేఖర్ కూడా దూకుడుగా ఉండాల‌ని స‌ల‌హాలు వినిపిస్తున్నాయి. కానీ, ఆయ‌న త‌న స్వభావాన్ని మార్చుకునే ప్రయ‌త్నం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు రాజ‌శేఖ‌ర్‌కు ఇంకా ఎమ్మెల్సీయే రాలేదు.. ర‌జ‌నీ మాత్రం మంత్రి ప‌ద‌వే టార్గెట్‌గా మ‌రింత దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ హామీ ఇవ్వని నేత‌ల‌కు కూడా ప‌ద‌వులు వ‌చ్చాయి. పార్టీ మారిన వారు కూడా ఎమ్మెల్సీలు అయ్యారు. మ‌ర్రి రాజశేఖర్ కి మాత్రం ప‌ద‌వి రాలేదు. ఇక మ‌ర్రికి ప‌ద‌వి కోసం బాగా శ్రమిస్తోన్న ఓ జూనియ‌ర్ వైసీపీ నేత మ‌ర్రికి దూకుడుగా ఉండాల‌ని స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. మ‌రి మ‌ర్రి దూకుడు పెంచ‌క‌పోతే ఆయ‌న అధిష్టానం దృష్టిలో మ‌రింత వెన‌క‌ప‌డే ప్ర‌మాదం ఉంది.

Tags:    

Similar News