చిరు రాజకీయాలకు అందుకే దూరం…?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి మాయం అయ్యారు. చిరు ఇలా పొలిటిక్స్ కి గుడ్ బై చెప్పడానికి చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి. అందరివాడుగా వుండాలనుకునే [more]

Update: 2020-01-06 07:53 GMT

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి మాయం అయ్యారు. చిరు ఇలా పొలిటిక్స్ కి గుడ్ బై చెప్పడానికి చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి. అందరివాడుగా వుండాలనుకునే చిరు పొలిటికల్ ఎంట్రీ తో కొందరివాడుగా మారిపోయారు. తనతో దశాబ్దాల కాలం ప్రయాణం చేసిన వారు కూడా ప్రత్యర్థులుగా మారిపోయారు. వారంతా తనపై విమర్శలు ఆరోపణలు చేస్తుంటే సున్నిత మనస్కుడైన మెగాస్టార్ కి నచ్చలేదు. వెండితెరపై నెంబర్ వన్ గా వెలిగి తీరా పొలిటికల్ స్క్రీన్ పై చతికిల పడటం మరీ నచ్చలేదు.

ఆ రొచ్చు మనకెందుకు అనే…

ఈ విషయాన్ని చిరంజీవే సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ సందర్భంగా స్వయంగా చెప్పేశారు. సినిమాల్లో తన సహచరి నటి విజయశాంతి తో బాగా గ్యాప్ రాజకీయాల వల్లే వచ్చిందని చిరు గుర్తించేశారు. మనసులో ఏది దాచుకోవడం అలవాటు లేని చిరు 20 సినిమాల్లో కలిసి నటించాం, మద్రాస్ లో ఎదురెదురు ఇళ్లల్లో వుంటూ ఒకే కుటుంబం లా మెలిగాం. ఇంత స్నేహం ఉన్న నన్ను అనరాని మాటలు అనడానికి నీకు మనసు ఎలా వచ్చిందని ఓపెన్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టకముందే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి రాజకీయాలు వేరు సినిమా రంగం వేరని చెప్పుకున్నారు. మెగాస్టార్ నేరుగా పబ్లిక్ లో ఇలా ఆడిగేస్తారని భావించని విజయశాంతి చిరు కామెంట్స్ తో కొంత షాక్ తిన్నారు. అయితే చిరు కలగజేసుకుని రాజకీయాలు శత్రువులను పెంచుతాయని, సినిమాలు స్నేహాలు కలుపుతాయని తత్వం చెప్పేశారు.

సూపర్ స్టార్ కి అగౌరవం దక్కించండి

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లకు మెగాస్టార్ ఒక విజ్ఞప్తి చేశారు. అదే సూపర్ స్టార్ కృష్ణ కు చిత్ర పరిశ్రమలోని వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ అవార్డు ఇవ్వాలని. దానికోసం ఇద్దరు సీఎం లు తలుచుకోవాలని కోరారు. కృష్ణ కు ఎందుకో రావాలిసిన గుర్తింపు దక్కలేదని అనిపిస్తుందని ఆవేదన చెందారు చిరు. సౌత్ ఇండియా లోనే సినీ పరిశ్రమలో అలాంటి హీరో లేరని 350 చిత్రాల్లో నటించి ఆల్ టైం రికార్డ్ సూపర్ స్టార్ దే అని చెప్పారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రేక్షకుల కోసం సినీ పరిశ్రమ అభివృద్ధికి కృష్ణ ఎనలేని కృషిని మెగాస్టార్ కొనియాడారు.

దాసరి పాత్ర పోషిస్తారా..?

మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇచ్చాకా ఆ రంగంలో తనకున్న పట్టు మరింత పెంచుకునే పనిలో పడినట్లే కనిపిస్తుంది. సాధారణంగా గీతా ఆర్ట్స్ లేదా తన కుటింబీకులు నటించే చిత్రాల ఆడియో ఫంక్షన్ లు ప్రిరిలీజ్ లకు మాత్రమే ఆయన అటెండ్ అయ్యేవారు. కానీ ఇటీవల ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా చిరంజీవి హాజరౌతు అందులో సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుపడే సూచనలు సలహాలు ఇస్తూ, చిన్నా పెద్దా అందరితో కలివిడిగా వుంటున్నారు. గతంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇదే ట్రెండ్ లో నడిచేవారు. పరిశ్రమకి వచ్చే సమస్యలకు ఆయన ట్రబుల్ షూటర్ అనే పేరు సంపాదించారు. ఆయన మరణం తరువాత దాసరి స్థానం భర్తీ చేయగల సత్తా ఒక్క చిరంజీవికె ఉంది. చిత్ర పరిశ్రమతో ఉన్న అనుబంధం దశాబ్దాలుగా ఉన్న స్నేహాలు ఆయన మాటకు విలువ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ అభివృద్ధే తన జీవిత ఆశయంగా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి.

Tags:    

Similar News