Ycp : అసలు ఈయన ఒకడున్నాడని జగన్ కు గుర్తుందా?
జగన్ ను నమ్మి వెంట నడిచిన వాళ్లు అనేకమంది ఉన్నారు. అందులో చాలా మందికి జగన్ అధికారంలోకి రాగానే పదవులు ఇచ్చారు. కొందరికి మంత్రి పదవులు, మరికొందరికి [more]
జగన్ ను నమ్మి వెంట నడిచిన వాళ్లు అనేకమంది ఉన్నారు. అందులో చాలా మందికి జగన్ అధికారంలోకి రాగానే పదవులు ఇచ్చారు. కొందరికి మంత్రి పదవులు, మరికొందరికి [more]
జగన్ ను నమ్మి వెంట నడిచిన వాళ్లు అనేకమంది ఉన్నారు. అందులో చాలా మందికి జగన్ అధికారంలోకి రాగానే పదవులు ఇచ్చారు. కొందరికి మంత్రి పదవులు, మరికొందరికి నామినేటెడ్ పదవుల ఇచ్చి సంతృప్తి పర్చారు. కానీ నోరు లేని నేతలు మాత్రం ఇంకా పదవుల కోసమే తాడేపల్లి ఇంటి వైపు చూస్తున్నారు. వారిలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఒకరు. ఆయన ఒకరంటూ ఉన్నారని కూడా ఇంతవరకూ వైసీపీ అధినాయకత్వం గుర్తించకపోవడంపై చర్చ జరుగుతోంది.
మూడు సార్లు గెలిచి…
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జగన్ పార్టీ పెట్టిన వెంటనే చేరారు. నూజివీడు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఇప్పటికి మూడుసార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2004, 2014, 2019 ఎన్నికలలో గెలిచిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 2009లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఆ పార్టీకి ఇక్కడ సరైన నేత లేరు.
సామాజిక సమీకరణాలే….
సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయన వెలమ సామాజికవర్గ కావడంతో ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది. ఏపీలో ఆ సామాజికవర్గం తక్కువే. దీనికి తోడు కృష్ణా జిల్లాలో కమ్మ, కాపు సామాజికవర్గాలకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే బ్రాహ్మణ, వైశ్య వంటి కులాలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మంత్రి పదవి దక్కే అవకాశం లేదు.
ఆ కారణం కూడా…..
మేకా కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆ కుటుంబం 1955 నుంచే కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర పోషించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయనకు ఇప్పటికీ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుతో సంబంధాలున్నాయి. ఆ కారణంతోనే జగన్ ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదన్న ప్రచారమూ ఉంది. మొత్తం మీద ఈ మంత్రి వర్గ విస్తరణలోనూ ఈ సీనియర్ ఎమ్మెల్యేకు పదవి దక్కడం కష్టమే.