మేక‌పాటి ఇప్పుడు చేస్తున్నదదే..?

మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న నాయకులు. కాంగ్రెస్‌లో కీల‌క పాత్ర పోషించిన మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి.. త‌న కుటుంబాన్ని కూడా [more]

Update: 2019-10-07 06:30 GMT

మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న నాయకులు. కాంగ్రెస్‌లో కీల‌క పాత్ర పోషించిన మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి.. త‌న కుటుంబాన్ని కూడా రాజ‌కీయాల్లోకి తెచ్చారు. ముఖ్యంగా వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌కు అత్యంత విశ్వాస పాత్రులుగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు ఎంపీగా ప‌లుమార్లు విజ‌యం సాధించారు. అంత‌కు ముందు ఆయ‌న కాంగ్రెస్ నుంచి ఒంగోలు, న‌ర‌సారావుపేట ఎంపీగా కూడా గెలిచారు. నెల్లూరు జ‌న‌ర‌ల్ అయ్యాక జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస గెలుపుల‌తో హ్యాట్రిక్ కొట్టారు.

వైఎస్ అత్యంత సన్నిహితుడిగా….

వైఎస్ కు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటూనే ఆయన మ‌ర‌ణం అనంత‌రమే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు దారులుగా మారిపోయారు. త‌ర్వాత వైసీపీ ప్రారంభంతోనే ఆయ‌న కుటుంబంతో స‌హా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి సోద‌రుడు మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, వార‌సుడు మేక‌పాటి గౌతంరెడ్డిలు కూడా జ‌గ‌న్‌కు అత్యంత అనుచ‌రులుగా మారిపోయారు. 2012 ఉప ఎన్నిక‌ల్లో మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఉద‌య‌గిరి నుంచి, రాజ‌మోహ‌న్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఘ‌న‌విజ‌యం సాధించారు. మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి ఏకంగా సుబ్బ‌రామిరెడ్డిపై గెలిచారు.

2014 ఎన్నికల్లోనూ….

త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో ముగ్గూరు పోటీ చేశారు. చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, గౌతంరెడ్డిలు.. అసెంబ్లీకి పోటీ చేయ‌గా రాజ‌మోహ‌న్‌రెడ్డి నెల్లూరు పార్ల‌మెంటు కు పోటీ చేశారు. వీరిలో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఓడిపోగా… తండ్రి కొడుకులు ఇద్ద‌రు విజ‌యం సాధించారు. అయితే, అడ‌పాద‌డ‌పా.. వైసీపీ అనుస‌రిస్తున్న విధానాల‌పై ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేసేవారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తుగా వైసీపీ ఎంపీల‌ను రాజీనామా చేయాల‌ని ఆదేశించిన జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై అసంతృప్తి వ్య‌క్తి చేయ‌డ‌మే కాకుండా కొన్ని రోజులు ఆయ‌న పార్టీకి కూడా దూరంగా ఉన్నారు.

పార్టీ మారుతున్నారంటూ….

ఈ నేప‌థ్యంలోనే ఇంకేముంది పార్టీ మారిపోతున్నారంటూ.. మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ఎంపీగా రాజీనామా చేసిన త‌ర్వాత కూడా త‌న‌పై ఒత్తిడి కార‌ణంగానే రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానిం చారు. ఇలా.. పార్టీలో ఉంటూనే కొద్దిపాటి అసంతృప్తితో కాలం వెళ్లబుచ్చారు. ఇక‌, ఇటీవల జ‌రిగిన ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిని పూర్తిగా త‌ప్పించారు. ఆయ‌న మ‌ళ్లీ పోటీ చేయాల‌ని అనుకున్నా టీడీపీ నుంచి చివ‌ర్లో వ‌చ్చిన ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి జ‌గ‌న్ సీటు ఇచ్చారు. వ‌యోః భారంతో మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిని త‌ప్పించామ‌ని జ‌గ‌న్ చెప్పినా చివ‌ర‌కు మ‌ళ్లీ వ‌య‌స్సులో పెద్ద అయిన ఆదాల‌కు సీటు ఇచ్చారు.

ప్రత్యక్ష్య రాజకీయాలకు…..

మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిని త‌ప్పించిన జ‌గ‌న్ ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న‌యుడు గౌతంరెడ్డికి ఆత్మ‌కూరు, సోద‌రుడు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి ఉద‌య‌గిరి సీటు ఇవ్వ‌గా ఇద్ద‌రు విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న కుమారుడు గౌతంరెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే కాకుండా ప్ర‌స్తుతం త‌న కేబినెట్‌లో అత్యంత కీల‌క‌మైన ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను కూడా అప్ప‌గించారు. ఇక‌, అప్ప‌టి నుంచి రాజ‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో జోక్యం త‌గ్గించారు. అంత‌కుముందు పార్టీ త‌ర‌ఫున ఢిల్లీలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేవారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌నే అంటున్నారు. మ‌రి దీంతో ఇక‌, మేక‌పాటి దాదాపు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యార‌నే అంటున్నారు విశ్లేష‌కులు.

Tags:    

Similar News