సుచరిత బాగా ఫీల్ అవుతున్నారటగా?

ఏపీలో తెలుగు దేశం అధికారంలో ఉంటే కమ్మ సామాజిక వర్గం నేతల హ‌వా ఎక్కువగా ఉంటుందన్న టాక్ ఉంది. గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో కమ్మ సామాజిక [more]

Update: 2021-09-27 14:30 GMT

ఏపీలో తెలుగు దేశం అధికారంలో ఉంటే కమ్మ సామాజిక వర్గం నేతల హ‌వా ఎక్కువగా ఉంటుందన్న టాక్ ఉంది. గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో కమ్మ సామాజిక వర్గ నేతల హడావుడి ఎక్కువైంద‌న్న ప్రధాన విమర్శను అస్త్రంగా చేసుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే రెడ్డి సామాజిక వర్గం నేతలు దూకుడు ఎక్కువగా ఉంటుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కమ్మలు, వైసిపి అధికారంలో ఉన్నప్పుడు రెడ్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ అధికారంలోకి వచ్చాక మెజార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు రెడ్లకే కట్టబెడుతూ వస్తున్నారు.

నియోజకవర్గంలో వారిదే…

వైసీపీ నుంచి లోక్‌స‌భ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ రెడ్డి నేతల దూకుడు ముందు మిగిలిన సామాజికవర్గాల నేతలు పూర్తిగా సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జగన్ వివిధ జిల్లాలకు నియమించిన సలహాదారులు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో మిగిలిన సామాజిక వర్గాలు నేతలు రుస‌రుస‌లాడుతున్నారు. చివరకు హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం ఇదే అంశంపై తన శాఖలోనే కాకుండా తన సొంత నియోజకవర్గంలోనూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

శాఖలోనూ….

ఇప్పటికే సుచరిత శాఖలో అనధికారిక హోంమంత్రిగా కీలక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం ఎక్కువగా ఉన్నట్టు ఉంది. ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో కూడా ప్రతిప నిలోనూ రెడ్డి నేతలే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అక్కడ రెడ్లు త‌క్కువ‌. ఏ పార్టీ అధికారంలో ఉన్నా క‌మ్మ నేత‌ల హ‌వానే ఉంటుంది. అయితే వై పీ అధికారంలో ఉండటంతో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో రెడ్డి నేతలే తమకు ఇష్టం వచ్చినట్టు పెత్తనం చెలాయిస్తున్నారు.

ఆమెకు తెలియకుండానే….

సాక్షాత్తు హోంమంత్రి సుచరిత నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు ఆమెకు తెలియకుండానే అక్కడ జరిగిపోతున్నాయి అట. అదేమంటే పైన ముఖ్యమంత్రిగా మావాడు ఉన్నాడ‌న్న సమాధానం రెడ్డి నేతల నుంచి వస్తుందని తెలుస్తోంది. ఇక సుచ‌రిత సైతం ప్రత్తిపాడుపై, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై పెద్దగా దృష్టి సారించ‌డం లేద‌ట‌. ఇందుకు అక్కడ గ్రూపుల గోల‌తో ఆమె విసిగిపోవ‌డ‌మే కార‌ణ‌మంటున్నారు. ఇక ఆమె గుంటూరులోనే మ‌కాం ఉండ‌డంతో ప్రతిపాడులో క్రమక్రమంగా ప‌ట్టు కోల్పోతున్న పరిస్థితి ఉందని స్థానికంగా చర్చ నడుస్తోంది. సాక్షాత్తూ హోం మంత్రిగా ఉండి కూడా సుచ‌రిత‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌డం తాజా రాష్ట్ర ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది

Tags:    

Similar News