కొడాలి ప్రయోగం కొలిక్కి?
కొడాలి నాని…. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఒక వర్గం టీడీపీ ఎమ్మెల్యేలపై జగన్ వేసిన బాణమే కొడాలి నాని అంటున్నారు. మంత్రి కొడాలి నాని టీడీపీ [more]
కొడాలి నాని…. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఒక వర్గం టీడీపీ ఎమ్మెల్యేలపై జగన్ వేసిన బాణమే కొడాలి నాని అంటున్నారు. మంత్రి కొడాలి నాని టీడీపీ [more]
కొడాలి నాని…. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ఒక వర్గం టీడీపీ ఎమ్మెల్యేలపై జగన్ వేసిన బాణమే కొడాలి నాని అంటున్నారు. మంత్రి కొడాలి నాని టీడీపీ పంటి కింద రాయిలా తయారయ్యారు. వైసీపీలో టీడీపీ నేతల చేరికల వెనక కొడాలి నాని కృషి ఉందని చెప్పుకుంటున్నారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. టీడీపీ నేతలు ఒక్కొక్కరూ పార్టీని విడిచి వెళ్లడం ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఇరకాటంలో పెట్టేదయితే… అది చూసి ఆనందపడుతోంది వైసీపీ.
కమ్మ సామాజికవర్గంపైనే…..
తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధాన సామాజిక వర్గంపై వైసీపీ కన్ను పడిందంటున్నారు. చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ కులానికి చెందిన ఎమ్మెల్యేలపైనే వైసీపీ గురిపెట్టిందంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో చంద్రబాబు కూడా ఒకరు. అత్యధికులు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో బాబు పార్టీని వీడరని నమ్మకం పెట్టుకున్నారు. కానీ తొలి ఎమ్మెల్యేనే అదే సామాజిక వర్గం నుంచి పార్టీకి రాజీనామా చేయించి వైసీపీ మానసికంగా దెబ్బ తీసింది.
సామదానభేద దండోపాయాలతో….
మళ్లీ కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ కొడాలి నానిని ప్రయోగించినట్లు తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది. వారి మీద ఉన్న కేసులు, వ్యాపారాలపైనే వైసీపీ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. వ్యాపారాలు ఎక్కువగా ఉండటంతో వారిపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించాలని వైసీీపీ భావిస్తుందని టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇందులో కొంతమంది ఇప్పటికే వైసీపీ టచ్ చేసినట్లు చెబుతున్నారు.
టచ్ లోకి కొడాలి నాని…
మంత్రి కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో ఒకసారి మాట్లాడినట్లు చెబుతున్నారు. గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలతో ప్రాధమిక చర్చలను కొడాలి నాని డిస్కస్ చేసినట్లు టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే వీరంతా ఎలాంటి హామీ ఇవ్వకపోయినా తమకు కొంత సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నాటికి టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీలో చేరే అవకాశముందని ఏపీలో చర్చ జోరుగా సాగుతోంది.