మంత్రిగారి బ్రదర్ మహాముదురు.. అప్పుడు-ఇప్పుడు అంతే
`ఆ మంత్రిగారి తమ్ముడు మహాముదురు!`- వైసీపీ కేబినెట్ మంత్రుల్లో కీలకంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన సీనియర్ మంత్రి గారి గురించి నేరుగా పార్టీ పెద్దల [more]
`ఆ మంత్రిగారి తమ్ముడు మహాముదురు!`- వైసీపీ కేబినెట్ మంత్రుల్లో కీలకంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన సీనియర్ మంత్రి గారి గురించి నేరుగా పార్టీ పెద్దల [more]
'ఆ మంత్రిగారి తమ్ముడు మహాముదురు!'- వైసీపీ కేబినెట్ మంత్రుల్లో కీలకంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన సీనియర్ మంత్రి గారి గురించి నేరుగా పార్టీ పెద్దల మధ్యే జరుగుతున్న చర్చ ఇది! ఆశ్చర్యం గా అనిపించినా.. ఇది నిజం అంటున్నారు పార్టీలో ఉండే కీలక నేతలు కూడా! వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన ఈయన.. అప్పట్లోనే మంత్రిగా.. పార్టీకి చీఫ్ గా కూడా చక్రం తిప్పారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత.. ఆయన నేరుగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కిన ఆయనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు.
కుటుంబ సభ్యుల జోక్యంతో…
అంతేకాదు, కీలక నాయకుడిగా ఆయనను గుర్తించారు. దీంతో కేబినెట్‌లోను, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ సదరు మంత్రివర్యుల హవా ఓ రేంజ్‌లో సాగుతోంది. పార్టీలో పరిస్థితిని పక్కన పెడితే.. ప్రభుత్వంలో ఆయనకు తిరుగులేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యంత కీలకమైన రాజధాని విషయం సహా.. అనేక అంశాలను ఆయనకే జగన్ అప్పగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయన పనితీరుకు మార్కుల పరిస్తితి ఎలా ఉన్నా.. కుటుంబం చలాయిస్తున్న ఆధిపత్యాన్ని మాత్రం మంత్రి వర్యులు తగ్గించలేక పోతున్నారు. గతలో కాంగ్రెస్‌లో ఉన్నసమయంలో సదరు నాయకుడు మంత్రిగా చక్రం తిప్పారు.
సెక్యూరిటీతో పాటు కాన్వాయ్….
అప్పట్లో ఆయన సోదరుడు, వరుసకు మేనల్లుడు అయ్యే వ్యక్తి.. పార్టీలోను, ప్రభుత్వ పరంగా అధికారంలోను కూడా చక్రం తిప్పేవారు. ఆ టైంలో జిల్లా అంతటా ఆయన కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉండేది. ప్రజాప్రతినిధులు అందరూ ఆయన కుటుంబ సభ్యులో లేదా అనుచరులో ఉండేవారు. దీంతో మంత్రిగారిని కలవాలంటే.. ముందు వీరి అనుమతి తీసుకోవాలా? లేక వీరి కి ముందుగా సమర్పించుకోవాలా? అనే చర్చ సాగేది. ఇక ఇప్పుడు 'సమర్పణలు' లేకపోయినా.. మంత్రిగారి తమ్ముడు మాత్రం మహా రెచ్చిపోతున్నారు. ఈయనకు ఒక్క సెక్యూరిటీ.. భారీ కాన్వాయ్ మాత్రమే లేదని.. అన్నీ .. మాత్రం మంత్రిగానే చలామణీ అవుతున్నారని స్థానికంగా జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
వివాదాల్లో చిక్కుకుని…..
అంతేకాదు, ఈయనగారు. ప్రజలు కష్టపడి కొనుక్కున్న వాటిని కూడా 'నావి'.. అంటూ.. ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు కొందరు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు.. అలా .. అలా .. జిల్లాలు దాటుకుని రాజధాని జిల్లా వరకు వచ్చాయి! దీంతో 'మంత్రిగారి తమ్ముడు మహాముదురు' అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఇదే విషయం జగన్‌కు తెలిస్తే.. ఏం జరుగుతుందో చూడాలి.