బాబు వైఫల్యాలను చూపెట్టేస్తున్నారు?

ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందన్న సామెతను గుర్తు చేస్తూ అధికార వైసిపి విపక్ష టిడిపి వైఫల్యాలను ప్రజల్లో ఎత్తిచూపే పనిలో పడింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ [more]

Update: 2019-06-18 02:30 GMT

ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందన్న సామెతను గుర్తు చేస్తూ అధికార వైసిపి విపక్ష టిడిపి వైఫల్యాలను ప్రజల్లో ఎత్తిచూపే పనిలో పడింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అమరావతిని అరచేతిలో చూపించి ప్రజలను చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారో చూడండి అంటూ యాక్షన్ లోకి దిగారు మంత్రులు, ఎమ్యెల్యేలు. విజయవాడలోని దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణం ఇప్పటికి నత్తనడకన సాగుతున్న తీరుపై మంత్రులు ధర్మాన కృష్ణ దాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్యెల్యే మల్లాది విష్ణు బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆప్రాంతాన్ని పరిశీలించి, చంద్రబాబు నాయుడు చిన్న ఫ్లై ఓవర్ ఐదేళ్లల్లో నిర్మించి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కనుగొనలేక పోయారని కానీ అమరావతి నిర్మాణమని కట్టుకధలతో నమ్మించే ప్రయత్నం చేసి దెబ్బతిన్నారంటూ ఈ వారధిని ఉదాహరణగా చూపే ప్రయత్నం చేసింది.

ఇది జగన్, టైం బౌండ్ … బాబు కాలంలో లా కాదు…

గత సర్కార్ హయాంలో విజయవాడ ట్రాఫిక్ కి గుండెకాయ లాంటి దుర్గ గుడి ఫ్లై ఓవర్ పై చంద్రబాబు నాయుడు అనేక టైం బౌండ్ ప్రోగ్రాం లు ఫిక్స్ చేశారు. అయితే ఏది పని జరగక ప్రజల్లో విమర్శలకు గురయ్యారు. తాజాగా ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్న ఈ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రుల బృందం డిసెంబర్ 31 కి తమ సర్కార్ టైం బౌండ్ పెట్టిందని ప్రకటించింది. తమ టైం బౌండ్ లు చంద్రబాబు నాయుడు టైం బౌండ్ లా ఉండవని ఇది జగన్ టైం బౌండ్ అని కాంట్రాక్టర్ గుర్తించుకోవాలని హెచ్చరించింది. నత్తనడకన ఏళ్లతరబడి ప్రజోపయోగ పనులు సాగేందుకు వీలు లేదని సందేశాన్ని పంపింది బృందం. ఒక నెలరోజుల పాటు ప్రజలు సైతం సహకరించాలని నిర్మాణ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిపివేసి పనులు వేగవంతం చేస్తామంటుంది వైసిపి ప్రభుత్వం. అయితే చంద్రబాబు నాయుడు టైం బౌండ్ కి విలువ ఇవ్వని కాంట్రాక్టర్ జగన్ టైం బౌండ్ కి ఏమేరకు విలువ ఇస్తాడో డిసెంబర్ 31 కి తేలిపోనుంది.

Tags:    

Similar News