గుప్పిట మూసి ఉంచితే గుట్టు ఆగుతుందా?

అధికార పార్టీలో అసంతృప్తులు సహజం. కానీ ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు అసంతృప్తికి గురైతే అధిష్టానం సయితం కలవర పడుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లో [more]

Update: 2020-03-21 11:00 GMT

అధికార పార్టీలో అసంతృప్తులు సహజం. కానీ ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు అసంతృప్తికి గురైతే అధిష్టానం సయితం కలవర పడుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లో బయటకు కన్పించని అసంతృప్తులు ఉన్నాయి. అయితే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండటంతో ఇవి పెద్దగా బయట పడటం లేదు. పార్టీ అంతర్గత చర్చలకే పరిమితమవుతున్నాయి. అయితే ఇది ఎప్పుడు? ఎంతవరకూ దారితీస్తుందో? చెప్పడం కష్టమే అయినప్పటికీ అధికార పార్టీ కావడంతో గుప్పిట మూసి అంతా బాగానే ఉన్నట్లు బయటకు బిల్డప్ ఇస్తుంది.

రెండోసారి అధికారంలోకి వచ్చాక….

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో కూడా సీనియర్లను పక్కన పెట్టారు. తాను అనుకున్నట్లుగానే మంత్రివర్గ కూర్పు జరిగింది. మరోసారి విస్తరణ ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అని ఊరిస్తూ వస్తున్నారు కాని మంత్రి వర్గ విస్తరణ జరగడం లేదు. కొందరు మంత్రులను తొలగించాలని కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ అయ్యారన్న ప్రచారమయితే ఉంది. కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. అయితే తమకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలు.

మైనంపల్లి అసంతృప్తి…..

వారిలో మైనంపల్లి హనుమంతరావు ఒకరు. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి గెలిచిన మైనంపల్లి హనుమంతరావు తనకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. సీనియర్ కావడంతో తనకు అవకాశం ఉంటుందనుకున్నారు. కానీ కేసీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారన్నది టాక్. తనను పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన బాహాటంగానే విమర్శలకు దిగుతుండటం విశేషం.

అసెంబ్లీ సమావేశాలకూ….

అయితే మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. మైనంపల్లి అసంతృప్తిని గమనించిన కేటీఆర్ రెండు సార్లు భేటీ అయినా ఫలితం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలకు సయితం మైనంపల్లి హనుమంతరావు హాజరుకాలేదు. నియోజకవర్గంలోనే ఉన్నా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ లో అసంతృప్తి చాప కింద నీరులా విస్తరిస్తుందనేది వాస్తవం.

Tags:    

Similar News