బ్రేకింగ్ : దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

కరోనాపై పోరాటంలో మద్దతుగా నిలిచిన 130 కోట్ల మంది ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండో విడత లాక్ డౌన్ పై మోదీ కీలక ప్రకటన [more]

Update: 2020-04-14 04:50 GMT

కరోనాపై పోరాటంలో మద్దతుగా నిలిచిన 130 కోట్ల మంది ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండో విడత లాక్ డౌన్ పై మోదీ కీలక ప్రకటన చేశారు. ఎన్ని కష్టాలున్నా దేశం కోసం ప్రజలంతా ఒక్కటై నిలబడ్డారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కరోనాపై భారత్ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు అందించిన సహకారం మరువలేమన్నారు. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తినడానికి, ప్రయాణీలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. ఈ విజయంలో ప్రజలదే కీలక పాత్ర అని మోదీ స్పష్టం చేశారు. కరోనా కోసం పండగలను కూడా భారతీయులు సంయమనంతో నిరాడంబరంగా జరుపుకున్నారన్నారు.

అనేక చర్యలతో కట్టడి….

విదేశాల నుంచి వచ్చిన వారిని 14రోజులను క్వారంటైన్ కు పంపామన్నారు. కరోనా కట్టడి కోసం మాల్స్, సినిమా థియేటర్లు అన్నీ బంద్ చేయాల్సి వచ్చిందన్నారు. లాక్ డౌన్ సంతృప్తికరంగా అమలవుతుందన్నారు. లాక్ డౌన్ వల్లనే కరోనా కట్డడి చాలా వరకూ సాద్యమయిందని మోదీ చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ పోరాటం గొప్పగా ఉందన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. లాక్ డౌన్, భౌతిక దూరం పాటించడంతోనే కరోనాను జయించగలమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చుకోవడం కూడా ముఖ్యమని మోదీ అభిప్రాయపడ్డారు.

అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత….

లాక్ డౌన్ పై మేధావులు, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్నామని మోదీ చెప్పారు. అందరూ లాక్ డౌన్ ను కొనసాగించాలని సూచించారన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ను పొడిగించాయన్నారు. మే 3 వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రజల ప్రాణాల కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. ఆర్థిక వ్యవస్థ కంటే జీవితం గొప్పదని మోదీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితి మే 3వ తేదీ వరకూ కొనసాగుతుందని చెప్పారు. మరో 19 రోజులు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ వరకూ కఠినంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

Tags:    

Similar News