ఇద్దరినీ ఆహ్వానిస్తారా?
కేంద్రంలోని నరేంద్ర మోడీ కొత్త ఎత్తులు వేస్తున్నారు. బలం ఒక చోట కోల్పోతే మరో చోట సమీకరించుకోవాలనుకుంటున్నారు. వరసగా జార్ఖండ్, మహారాష్ట్ర వంటి చోట్ల బీజేపీకి దిమ్మ [more]
కేంద్రంలోని నరేంద్ర మోడీ కొత్త ఎత్తులు వేస్తున్నారు. బలం ఒక చోట కోల్పోతే మరో చోట సమీకరించుకోవాలనుకుంటున్నారు. వరసగా జార్ఖండ్, మహారాష్ట్ర వంటి చోట్ల బీజేపీకి దిమ్మ [more]
కేంద్రంలోని నరేంద్ర మోడీ కొత్త ఎత్తులు వేస్తున్నారు. బలం ఒక చోట కోల్పోతే మరో చోట సమీకరించుకోవాలనుకుంటున్నారు. వరసగా జార్ఖండ్, మహారాష్ట్ర వంటి చోట్ల బీజేపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అన్నింటికీ మించి మూడు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత మిత్రుడుగా ఉన్న శివసేన శత్రువై కూర్చుకుంది.బీహార్లో నితీష్ కుమార్ ఎపుడు చెల్లు చీటి రాస్తాడో తెలియదులా ఉంది. దాంతో దక్షిణాదిన కొత్త మిత్రుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సాన్నిహిత్యం నెరపాలని మోడీ, షా అనుకుంటున్నారుట.
ఘన ఆహ్వానం….
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1న ప్రారంభం అవుతాయి. ఇవి రెండు దఫాలుగా ఏప్రిల్ వరకూ సాగుతాయి. ఈ బడ్జెట్ సెషన్ పూర్తి అయిన తరువాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చునని అంటున్నారు. కేంద్రంలో కొత్తగా ఖాళీలతో పాటు, పాత వారికి ఇచ్చిన అదనపు శాఖలు కూడా లాగెసి ఇతరులకు ఇవ్వాలనుకుంటున్నారు. దాంతో పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీలకు కూడా కేంద్ర జట్టులోకి రమ్మని ఘనమైన ఆహ్వానాలు వస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
ఓకే అంటారా..?
టీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ కు వ్యూహాలు జాస్తి. అదే సమయంలో వచ్చిన అవకాశాలు వాడుకోవడంలోనూ ఘనాపాటి. తన కుమార్తె కవితను కేంద్ర మంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. కవితను ఎంపీని చేసి మోడీ క్యాబినేట్లో కీలక శాఖకు మంత్రిగా చేయాలన్నది ఒక ఆలోచనగా ఉందని అంటున్నారు. దీని వల్ల మజ్లిస్ తో విభేదాలు వచ్చిన బేఫికర్ అనుకుంటున్నారుట. ఎంత అరచి గీ పెట్టినా బీజేపీ తెలంగాణాలో ఎదగదు అని కాంగ్రెస్ సీన్ అంతేనని, ఈ పాటి భాగ్యానికి వచ్చిన పదవులు వదులుకోవడం వివేచన అనిపించుకోదు అన్నది టీఆర్ఎస్ ఆలోచన అంటున్నారు.
జగన్ సై అంటారా?
మరో వైపు ఏపీలో జగన్ కూడా కేంద్రంలో చేరేందుకు రెడీగా ఉన్నారని చాలాకాలంగా వినిపిస్తున్న మాట. కేంద్రం సాయం లేకపోతే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏపీకి ఉంది. పైగా 22 మంది ఎంపీలను దగ్గర పెట్టుకుని మంత్రివర్గంలో చేరకపోతే అది వ్యర్ధం అన్న మాట కూడా ఉంది. మరో వైపు కేంద్రంలో తమ వారు మంత్రులుగా ఉంటే వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఇక ఏపీ రాజకీయాలు చూసుకుంటే పవన్ జనసేనతో బీజేపీకి పొత్తు ఉంది. ఇపుడు వైసీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరితే పవన్ కూడా కిక్కురుమనలేని పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బాబుని ఒంటరి చేయవచ్చునన్న ప్లాన్ కూడా ఉంది. మూడు రాజధానుల ప్రయోగం చేసిన జగన్ కి ఈ టైంలో కేంద్రం అండ చాలా ముఖ్యం. దాంతో ఆయన మోడీతో జట్టు కడతారని అంటున్నారు. ఈమధ్య జరిగిన ఇద్దరు తెలుగు సీఎంల భేటీలో ఈ అంశం మీద కూడా చర్చ సాగిందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.