దేశద్రోహులు ఎవరు?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటుంది. మోదీ నిర్ణయాలపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ఉద్యోగి వెంకట రమణ రాసిన లేఖ ఇప్పుడు [more]

Update: 2021-02-07 02:19 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటుంది. మోదీ నిర్ణయాలపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ఉద్యోగి వెంకట రమణ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ అవుతుంది. తాను మోదీని, ఆయన నిర్ణయాలను అమితంగా ఇష్టపడ్డానని, వ్యతిరేక ప్రచారాన్ని గిట్టని వారు చేస్తుందిగా నమ్మానని వెంకటరమణ అనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చెప్పుకొచ్చారు. ఆయన లేఖ యధాతధంగా

నా పేరు వెంకట రమణ. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని.*
మొన్నే రామమందిరం కోసం చందా అడిగితే జై శ్రీరామ్ అంటూ సంతోషంగా వెయ్యేన్నుటపదహార్లు విరాళం ఇచ్చా.!!
2014లో ప్రధాని అభ్యర్థిగా మోడీ గారి కరిష్మా, ప్రచారంలో ఆకట్టుకునే ప్రసంగాలు చూసి అతడే దేశ ప్రధాని అయితే బావుండు అనిపించింది. అనుకున్నట్టే ప్రధాని అయ్యాడు.!!
నల్లధనం, దొంగనోట్లు బయటపెట్టడానికి ఆయన చేసిన ‘నోట్లరద్దు’ కు మద్దతు ఇవ్వడమే కాదు, రోజూ గంటలతరబడి క్యూ లైన్ లో నిలబడి దేశ సమగ్రతకు, అభ్యున్నతికి చేస్తున్న గొప్ప పనిగా గర్వపడ్డాను.
రాష్ట్రాల్లో VAT రద్దు చేసి దేశం మొత్తం ఓకే పన్ను GST తెస్తే, ధరలు తగ్గుతాయని సంతోషించాను. చట్టం అమలు అయినతర్వాత ఎందుకు ధరలు తగ్గలేదు అని నా కొలీగ్స్ అడిగినప్పుడు GST వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. తాత్కాలిక ఉపశనం కోసం కాదు. ఇది దేశానికి శాశ్విత లాభాన్ని ఇచ్చి, ఫ్యూచర్ లో ధరలు తగ్గుతాయని వాదించాను.!!
అంతర్జాతీయంగా చమురు రేటు తగ్గినా, మన దేశంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా కాలుష్యం తగ్గగించాలని ధరలు పెంచారు అనుకోని సమర్థించుకొన్నాను.!!
IRCTC రైల్వే ని ప్రయివేటు పరం చేసినపుడు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని భావించాను.!!
HPCL ని అమ్మేస్తుంటే దేశంలో ఫ్యచర్లో ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయి, అలాంటప్పుడు ప్రభుత్వానికి పెట్రోల్ తో అవసరం ఏముందని ప్రభుత్వ విజన్ కి అబ్బురపోయా.!!
BSNL ఉద్యోగుల్ని తీసేస్తుంటే (VRS) నెట్వర్క్ సరిగా ఉండదు కాబట్టి ప్రభత్వం మంచిపని చేస్తోంది అనుకున్నా. !!
(కానీ 4G, 3G లైసెన్సులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అప్పుడు ఆలోచించలేకపోయా)
LIC తో అప్పుల్లో కూరుకుపోయిన బ్యాంకులను కొనిచ్చినపుడు బ్యాంకులకు సాయపడ్డ గుణాన్ని చూసా. ఇప్పుడు దాన్ని కూడా ప్రయివేటుపరం చేస్తుంటే ఏజెంట్ల బెడద పోయి, మంచి పాలసీలు వస్తాయి అనుకున్నా.!!
NRC కి వ్యతిరేకంగా జనాలు రోడ్డెక్కితే తిన్నది అరక్క నిరసన చేస్తున్నారు, వాళ్ళను దేశద్రోహులు అనుకున్నాను.!!
రైతులు ఢిల్లీలో రెండున్నర నెలల నుంచి ఆందోళనలు చేస్తుంటే ఖాలిస్తాన్ తీవ్రవాదులు, చైనా కమ్మీలు వీరికి ఫండింగ్ ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నారని వాట్సాప్ ద్వారా తెలుసుకున్నాను.!!
దేశంలో రకరకాల చట్టాలు చేస్తుంటే మోడీ అంటే గిట్టనివారు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అని భావించాను.!!
దేశంలోని రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుంటే నాణ్యమైన సేవలు ప్రజలకు ఇవ్వడానికి ప్రయివేటు పరం చేస్తున్నారని అనుకున్న.!!
ఆయన ఇస్తానన్న 15 లక్షలూ ఏదో రోజు బ్యాంకులో వేస్తారని చూసాను. కానీ జుమ్లా బాత్ అని అమిత్ షా గారు చెబితే ఏదో ఓట్ల కోసం ధర్మం కోసం పచ్చి అబద్దాలు ఆడి ఉంటారనుకుని సర్ది చెప్పుకున్నా.
కానీ. ..
ఇప్పుడు నేను పనిచేస్తున్న “వైజాగ్ స్టీల్ ప్లాంట్” ని ప్రయివేటుపరం చేస్తారని తెలుసుకున్నాను. ఇన్నేళ్లలో నేను ఊహించినవన్నింటినీ, అర్థం చేసుకున్న విషయాలను బుర్ర పెట్టి క్రాస్ చెక్ చేసుకుంటే ఒక విషయం అర్థం అయ్యి నా మొహంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది.!!
అదేంటంటే…!!
“ఇద్దరు గుజరాతీ నాయకులు దేశాన్ని అమ్మేస్తుంటే ఇద్దరు గుజరాతీ వ్యాపారులు దేశాన్ని కొనుక్కుంటున్నారు” అని.
రేపు మా ఉక్కు ఫ్యాక్టరీ కోసం, నా ఉద్యోగం కోసం ఉద్యమిస్తే… ఇదివరకూ నేను బుద్ధి లేకుండా వాట్సాప్ యూనివర్సిటీ మాటలు నమ్మి అనేకమంది ఉద్యమకారుల్ని దేశద్రోహులు అన్నట్టు, నన్ను కూడా దేశద్రోహి అని ముద్ర వేస్తారు అని నాకు తెలుసు.!!
భక్తి కోసం మతాన్ని , మతం కోసం ఒక పార్టీని ఇన్నేళ్లు వెనకేసుకొచ్చినందుకు నేను నిజంగానే దేశద్రోహినే.!!
విశాఖ ఉక్కు కోసం ఉద్యమించి సోకాల్డ్ దేశభక్తులతో దేశద్రోహి అనిపించుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధం. నాతో మీరు కూడా సిద్ధమా…?

Tags:    

Similar News