కాపు ఉద్యమానికి కాలం చెల్లినట్లేనా?
జీవితాన్ని ఫణంగా పెట్టి కాపు ఉద్యమాన్ని దశాబ్దాలుగా ముందుకు తీసుకువెళుతున్నా సొంత సామాజికవర్గం వారే సూటి పోటి మాటలతో వేధిస్తున్నారు. దాంతోబాటు సోషల్ మీడియా వేదికలపై అసభ్యంగా [more]
జీవితాన్ని ఫణంగా పెట్టి కాపు ఉద్యమాన్ని దశాబ్దాలుగా ముందుకు తీసుకువెళుతున్నా సొంత సామాజికవర్గం వారే సూటి పోటి మాటలతో వేధిస్తున్నారు. దాంతోబాటు సోషల్ మీడియా వేదికలపై అసభ్యంగా [more]
జీవితాన్ని ఫణంగా పెట్టి కాపు ఉద్యమాన్ని దశాబ్దాలుగా ముందుకు తీసుకువెళుతున్నా సొంత సామాజికవర్గం వారే సూటి పోటి మాటలతో వేధిస్తున్నారు. దాంతోబాటు సోషల్ మీడియా వేదికలపై అసభ్యంగా పోస్ట్ లు పెట్టడం పెద్దాయనకు మనస్థాపం కలిగించింది. ఫలితంగా ఆయన దీక్ష గా కొనసాగిద్దామనుకున్న ఉద్యమ నాయకత్వానికి టాటా చెప్పేశారు. ఇది మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీసుకున్న నిర్ణయం. కట్ చేస్తే ఆ తరువాత 13 జిల్లాల కాపు జెఎసి లు ముద్రగడనే నేతృత్వం వహించాలని కోరుకుంటూ వస్తున్నాయి. ఆయన మాత్రం ససేమిరా అనేశారు. వెనక్కి వచ్చేది లేదని భీష్మించారు.
ఇక్కడితో ఆగుతుందా …?
ముద్రగడ పద్మనాభం తరువాత అంతటి చరిష్మా తో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేవారు కనిపించడం లేదు. ఒక కులం లబ్ది కోసం ఉద్యమాన్ని నిర్మించడం అంటే రాజకీయంగా వారికుండే అవకాశాలను వదులుకోవడమే. మిగిలిన కులాలు ఉద్యమ నేత రాజకీయ భవితకు సహకరించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్యమాన్ని కొనసాగించే వారు కనుచూపు మేరలో కానరావడం లేదు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నా ఆయన కాపు రిజర్వేషన్ అంశాన్ని అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో దీనిపై కార్యాచరణ తీసుకున్నది లేదు.
ముద్ర పడకూడదనే పవన్ …
కాపు ముద్ర అన్నది తనపై పడకుండా మొదటి నుంచి జనసేనాని పార్టీ బండి లాక్కొస్తున్నారు. ఒక కులం ఆధారం తో అధికారం సాధించడం సాధ్యం కాదని ఆయనకు ప్రజారాజ్యం, జనసేన పార్టీల అనుభవాలు చెప్పక చెప్పేశాయి. దాంతో ముద్రగడ వదిలేసినా కాడి మోసేదెవరన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు వేసి 13 జిల్లాల్లో జేఏసీ లను ఏర్పాటు చేసి ఉవ్వెత్తున ఎగసిన కాపు ఉద్యమం కి ఇక కాలం చెల్లినట్లా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. చెప్పుకోవడానికి చాలామంది కాపునేతలే ఎపి లో ఉన్నా ముద్రగడ వంటి నిజాయితీ నిబద్ధత లేకపోవడం సెలబ్రిటీ స్టేటస్ కూడా లేకపోవడంతో ఇప్పుడు ఉద్యమ దారి ఎటు వైపు అన్నది చర్చనీయాంశం అయ్యింది.