టెన్షన్ మధ్య చేతులెత్తేశారు…!!
ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠ భరితం గా ముగిసింది. అందరు ఊహించినట్లే ముంబయి ఇండియన్స్ కప్ ఎత్తుకుపోయింది. ఫైనల్ లో అయినా సత్తా చాటుతుంది అనుకున్న చెన్నై ఒకే [more]
ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠ భరితం గా ముగిసింది. అందరు ఊహించినట్లే ముంబయి ఇండియన్స్ కప్ ఎత్తుకుపోయింది. ఫైనల్ లో అయినా సత్తా చాటుతుంది అనుకున్న చెన్నై ఒకే [more]
ఐపీఎల్ ఫైనల్ ఉత్కంఠ భరితం గా ముగిసింది. అందరు ఊహించినట్లే ముంబయి ఇండియన్స్ కప్ ఎత్తుకుపోయింది. ఫైనల్ లో అయినా సత్తా చాటుతుంది అనుకున్న చెన్నై ఒకే ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ను కప్ ను కూడా కోల్పోయింది. నువ్వా…? నేనా ?అన్నట్లు సాగిన పోరు మాత్రం క్రికెట్ ప్రేక్షకులకు నరాలు తెగేంత టెన్షన్ తెచ్చిపెట్టింది. చెన్నై విజయం కోసం స్టార్ బ్యాట్సమెన్ వాట్సన్ చేసిన 80 పరుగులు వృధానే అయ్యాయి. అత్యుత్తమంగా రెండు జట్లు ఫైనల్ లో తలపడిన అదృష్టం ముంబయి పక్షానే నిలబడటంతో ఆ జట్టు నాలుగోసారి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది.
తక్కువ స్కోర్ తో ముగించిన ముంబయి …
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన చెన్నయి సూపర్ కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ ముంబాయి పరమైంది. అత్యధిక సార్లు ట్రోఫీని అందుకున్న జట్టుగా సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది ముంబాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబాయి రోహిత్ డీ కాక్ జంట ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి ఔటైనా ఆ తరువాత సూర్య కుమార్, కృనాల్ వెంటవెంటనే వెనుతిరగడంతో 80 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడినా పోలార్డ్ రాణించడంతో 149 పరుగుల ను సాధించగలిగింది.
తొలి ఓవర్లలోనే తడబాబు….
150 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నయి 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వాట్సన్ ఒంటరి పోరాటమే చేశాడు. బ్రావో అండతో చెలరేగి ఆడాడు. 15 ఓవర్లో 19 పరుగులు 17 ఓవర్లో మూడు సిక్సు లు బాది ముంబాయి గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మలింగా చివరి ఓవర్ లో అద్భుతంగా చెన్నయి విజయాన్ని అడ్డుకున్నాడు. చివరి బంతికి రెండు పరుగులు సాధించాలిసిన స్థితి లో చెన్నయి బ్యాట్సమెన్ ఠాగూర్ ను ఎల్బీ చేసి అపూర్వ విజయాన్ని ముంబాయి ఇండియన్స్ కి అందించాడు మలింగా. ఈ విజయం కెప్టెన్ గా రోహిత్ కి మూడోది కాగా ముంబాయికి నాలుగోది. బంతి బంతికి ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్ మాత్రం అందరికి మజా పంచింది