ఈ ఎంపీగారు స్ట్రాంగ్ అవుతున్నారు?

వైసీపీలో ఎంపీల పనితీరు ఎలా ఉంది అన్న సర్వే నిర్వహిస్తే అధినాయకత్వానికి నిరాశగానే నివేదికలు వస్తున్నాయి. ఇక ఎంపీల గురించి జనాలు ఏమనుకుంటున్నారు అన్న చర్చకు వస్తే [more]

Update: 2021-10-02 05:00 GMT

వైసీపీలో ఎంపీల పనితీరు ఎలా ఉంది అన్న సర్వే నిర్వహిస్తే అధినాయకత్వానికి నిరాశగానే నివేదికలు వస్తున్నాయి. ఇక ఎంపీల గురించి జనాలు ఏమనుకుంటున్నారు అన్న చర్చకు వస్తే అసలు వారి పేర్లే తమకు తెలియవు అంటున్నారుట. మరి ఎంపీలను మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తే తాము ఢిల్లీకి గల్లీకి మధ్యలో మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలది హవా, ఇక ఢిల్లీ వెళ్ళి ఏం చేయాలో అసలు తెలియడంలేదు, దాంతో ఉన్న పదవీ కాలాన్ని హాపీగా తాపీగా గడిపేస్తున్నారు. అయితే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాత్రం తన పొలిటికల్ కెరీర్ ని బాగా స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారు.

అలా కలియతిరుగుతూ…?

ఈ మధ్యనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీరులో బాగా మార్పు వచ్చింది అంటున్నారు అంతా. ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే విశాఖ నియోజకవర్గంలో ఉంటున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు, జగన్ కుడి భుజమైన విజయసాయిరెడ్డితో సఖ్యతను మెయింటెయిన్ చేస్తూనే తన పరపతి కూడా మెల్లగా పెంచుకుంటున్నారు. విశాఖలో ఉంటే పార్టీ ఆఫీస్ కి నేతల తాకిడి ఉండేలా చూసుకుంటున్నారు. ప్రజా సమస్యల మీద కూడా వచ్చే నివేదికలను స్వీకరిస్తున్నారు. వాటికి పరిష్కారాలను కూడా చూపిస్తూ జనాలకు చేరువ అవుతున్నారు. ఈ విధంగా వచ్చే ఎన్నికల నాటికి తాను మళ్ళీ రంగంలో ఉండాలని ఎంవీవీ సత్యనారాయణ మాస్టర్ ప్లాన్ తో రెడీ అవుతున్నారని అంటున్నారు.

సినిమా కళతోనే ….

ఎంవీవీ సత్యనారాయణ పూర్వాశ్రమంలో సినీ నిర్మాత కూడా. ఆయనకు నటన అంటే కూడా ఇష్టమే. ఇపుడు విశాఖ నగరానికి చెందిన కొందరు మేకర్స్ అల్లూరి సీతారామరాజు మీద తీస్తున్న ఒక సినిమాకు ఎంవీవీ సత్యనారాయణ పూర్తి సహకారం అందచేస్తున్నారు. ఈ మూవీలో ఆయన బ్రిటిష్ కాలం నాటి తహశీల్దార్ గా నటిస్తున్నారు. ఈ విధంగా ముఖానికి రంగు వేసుకుని జనంలోకి మరింతగా చొచ్చుకుపోవాలనుకుంటున్నారు. ఎన్నికల లోగా ఆయన కూడా స్వయంగా సినిమాలు ఒకటి రెండు తీయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అలా ఒకనాటి ఎన్టీయార్ మాదిరిగా తాను కూడా సినీ కళతో జనాలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

ఆయనే ఖాయమా?

విశాఖ వైసీపీకి ఎంత తరచి చూసినా ఎంవీవీ సత్యనారాయణ కంటే కూడా బెస్ట్ క్యాండిడేట్ లేరనే అంటున్నారు. ఆయన అర్ధబలం, అంగబలం ముందు మిగిలిన వారు దిగదుడుపు అంటున్నారు. బిల్డర్ గా ఆయన విశాఖలో మూడు దశాబ్దాల క్రితమే స్థిరపడ్డారు. ఇక ఆయన పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. దాంతో ఆయనకు విశాఖతో మంచి సంబంధాలే ఉన్నాయి. వచ్చేసారి కూడా ఎంపీగానే పోటీ చేస్తాను అని ఆయన అనుచరులకు చెబుతున్నారు. పార్టీ సైతం ఆయన మీద ఎలాంటి రిమార్కులు లేకపోవడంతో టికెట్ ఇవ్వవచ్చు అంటున్నారు. దాంతో ఎంవీవీ సత్యనారాయణ వచ్చేసారి భారీ మెజారిటీతో గెలిచేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. మరి ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారా లేదా అన్నది ఫ్యూచర్ లోనే చూడాలి.

Tags:    

Similar News