మైసూరా వింత రాజకీయం… ?

మైసూరారెడ్డి రాజకీయ జీవితం నాలుగున్నర దశాబ్దాలు. ఆయన వైఎస్సార్ తో పాటే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉంటూ కీలకమైన పదవులు చేపట్టారు. ఒక [more]

Update: 2021-07-24 08:00 GMT

మైసూరారెడ్డి రాజకీయ జీవితం నాలుగున్నర దశాబ్దాలు. ఆయన వైఎస్సార్ తో పాటే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉంటూ కీలకమైన పదవులు చేపట్టారు. ఒక దశలో హోం మంత్రి వంటి పదవిని కూడా ఉమ్మడి ఏపీలో నిర్వహించారు. అటువంటి మైసూరారెడ్డి తరువాత కాలంలో తప్పుడు నిర్ణయాల కారణంగా బద్నాం అయిపోయారు. ఆయన వైఎస్సార్ మీద వ్యక్తిగ‌త ద్వేషంతో 2004 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌డ‌ప ఎంపీగా పోటీ చేసి వైఎస్ వివేకా చేతిలో ఓడిపోయారు. అయితే చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఇచ్చిన హామీ నెర‌వేర్చారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ తరువాత అక్కడ బాబుతో పొసగక జగన్ పెట్టిన వైసీపీలో చేరారు మైసూరారెడ్డి.

రెన్యువల్ చేయకపోవడంతో…?

2014 ఎన్నిక‌ల త‌ర్వాత మైసూరారెడ్డి రాజ్య‌స‌భ ప‌ద‌విని చంద్ర‌బాబు రెన్యువ‌ల్ చేయ‌లేదు. ఆ కోపంతోనే ఆయ‌న జ‌గ‌న్ చెంత చేరి 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం ప‌నిచేశారు. అయితే మొదట్లో బాగా ఉన్నా కూడా రాజ్యసభ సీటు ఆశించిన ఆయనకు జగన్ మొండి చేయి చూపించడంతో అందులో నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత మైసూరారెడ్డి మళ్ళీ టీడీపీలోకి వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ ఏ పార్టీ వైపు లేకుండా గ్రేటర్ రాయలసీమ పోరాట కమిటీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి సమస్యల మీద పోరాడుతున్నారు. తాజాగా మళ్లీ మైసూరారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. రాయలసీమకు జగన్ అన్యాయం చేస్తున్నారు అంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. జగన్ విధానాల వల్ల సీమ అన్యాయం అయిపోతోంది అని హాట్ కామెంట్స్ చేశారు.

సీమకు అన్యాయమే నంటూ….

కేంద్రం గెజిట్ వల్ల సీమకు పూర్తి అన్యాయమే అంటూ మైసూరారెడ్డి అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆయన చంద్రబాబుని పల్లెత్తుమాట అనలేదు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో బాబు విధానం ఏంటి అని నిలదీయలేదు. అంటే మైసూరారెడ్డి బాబుతో కలసి మళ్లీ పయనిస్తారా ?అన్న చర్చ అయితే వస్తోంది. ఇక ఆయన కుమారులు ఇద్దరూ కూడా వైసీపీలోనే ఉన్నారు. తమ్ముడు కుమారుడు సుధీర్ రెడ్డి జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సొంత కుమారుడు కూడా ఎర్ర‌గుండ్ల‌ నగర పంచాయతీ చైర్మ‌న్‌గా ఉన్నారు.

ఇటీవల పదవిని…

జ‌గ‌న్ కావాల‌నే మైసూరారెడ్డి సొంత త‌న‌యుడికి ఎర్ర‌గుండ్ల చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. మరి తనయులు జగన్ కి సపోర్ట్ గా ఉంటే మైసూరారెడ్డి మాత్రం ఇలా రివర్స్ కావడం విశేషం. ఆయన వింత రాజకీయం ఇదని అంటున్నారు. ఇక్కడో మాట ఉంది. మైసూరారెడ్డి అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని కూడా అని.. ఆయ‌న కుమారులే ఆయ‌న మాట వినే ప‌రిస్థితి లేదంటున్నారు. దాంతో ఆయన మీడియాలో ఎంత విమర్శలు చేసినా జగన్ కి ఏమీ కాదు అని ఆ పార్టీ నేత‌లు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News