మైసూరా ఫ్యామిలీకి జగన్ ఇలా న్యాయం చేస్తున్నాడా ?
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ను ఆ పదవికి రెండోసారి [more]
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ను ఆ పదవికి రెండోసారి [more]
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ను ఆ పదవికి రెండోసారి రెన్యువల్ చేయలేదని బయటకు వచ్చి వైసీసీలోకి వెళ్లారు. అక్కడా ఎక్కువ కాలం ఉండలేక బయటకు వచ్చిన ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను తీవ్రంగా విబేధించిన మైసూరారెడ్డి ఆయన తనయుడు జగన్ దగ్గర కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మైసూరా జగన్ వెంటే ఉండి ఉంటే ఈ రోజు కీలక పొజిషన్‌లోనే ఉండి ఉండేవారు. ఆయన నిలకడలేమి ఆయనకు మైనస్ అయ్యింది.
ఊహించని ప్రయారిటీ….
అయితే దశాబ్దాల మైసూరారెడ్డి ఫ్యామిలీ రాజకీయం మసకబారిపోతోంది అనుకుంటోన్న టైంలో జగన్ ఆ ఫ్యామిలీకి ఊహించని ప్రయార్టీ ఇచ్చాడు. మైసూరారెడ్డి కుమారుడికి కడప జిల్లాలో కీలక మున్సిపాల్టీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుండ్ల నగర పంచాయతీ చైర్మన్ పదవి మైసూరారెడ్డి కుమారుడు హర్షవర్థన్ రెడ్డికి కట్టబెట్టారు. జమ్మలమడుగు నియోజక వర్గంలో ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సుధీర్ రెడ్డి ఎవరో కాదు మైసూరాకు స్వయంగా తమ్ముడి కుమారుడే. సుధీర్ రెడ్డి అటు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి బావమరిది కూడా అవుతారు.
ఏకగ్రీవంగా ఎన్నికై….
ఇక ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డుల్లో ముందే 13 వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 7 వార్డుల్లో కూడా వైసీపీ విజయం సాధించడంతో ఇక్కడ 20 వార్డులు వైసీపీకి స్వీప్ అయ్యాయి. 16వ వార్డు నుంచి మైసూరారెడ్డి తనయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మైసూరారెడ్డి జగన్‌తో విబేధించినా కూడా తన చిన్నాన్న కుమారుడు అయిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి హర్షవర్థన్ రెడ్డి తండ్రినే కాదనుకుని వైసీపీలో ఉంటున్నారు. జగన్ స్వయంగా ఎమ్మెల్యే సుధీర్‌కు ఫోన్ చేసి ఎర్రగుండ్ల చైర్మన్‌గా హర్షవర్థన్ రెడ్డిని నియమించాలని చెప్పినట్టు తెలుస్తోంది.
ఉద్దండులైన నేతలున్నా….
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి లాంటి ఉద్దండులు అయిన నేతలు ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నప్పుడు వారితో పోలిస్తే చాలా జూనియర్ అయిన సుధీర్‌రెడ్డికి హర్షవర్థన్ రెడ్డి అండగా ఉన్నారు. ఈ సేవలన్నీ గుర్తించే జగన్ ఆయనకు నేరుగా ఎర్రగుండ్ల నగర పంచాయతీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఏదేమైనా మైసూరారెడ్డి ఫ్యామిలీకి మళ్లీ జగన్ గుర్తింపు ఇవ్వడంతో వాళ్లు లైమ్‌టైమ్‌లోకి వచ్చినట్లయ్యింది.