సౌండ్ లేదు.. జగన్ కు అండగా నిలవరా?
జలజగడం ఇంత జటిలమవుతున్నా మాట్లాడాల్సినోళ్లు మాట్లాడటం లేదు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి అరిచినోళ్లు సౌండ్ చేయడం లేదు. గత కొన్ని రోజులులగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల [more]
జలజగడం ఇంత జటిలమవుతున్నా మాట్లాడాల్సినోళ్లు మాట్లాడటం లేదు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి అరిచినోళ్లు సౌండ్ చేయడం లేదు. గత కొన్ని రోజులులగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల [more]
జలజగడం ఇంత జటిలమవుతున్నా మాట్లాడాల్సినోళ్లు మాట్లాడటం లేదు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి అరిచినోళ్లు సౌండ్ చేయడం లేదు. గత కొన్ని రోజులులగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య జలవివాదం జరుగుతుంది. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు అరిచి గోల చేస్తున్నారు. ఇదంతా రాజకీయ లబ్దికోసమేనని కొట్టిపారేస్తున్నా రాయలసీమ పరిరక్షణ సమితి నేత మైసూరారెడ్డి మాత్రం ఈ వివాదాన్ని పట్టించుకోనట్లే ఉండటం పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశమైంది.
సీనియర్ నేతగా….
మైసూరా రెడ్డి సీనియర్ నేత. రాజకీయంగా అనుభవమున్న ఆయన రాయలసీమ విషయంలో ఎందుకో ఈ మధ్య సైలెంట్ గానే ఉన్నారు. గతంలో జగన్, కేసీఆర్ లు కలసి గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకుందామని చర్చించుకున్నప్పుడు ఆ ప్రతిపాదనను మైసూరా రెడ్డి స్వాగతించారు. సీమకు గోదావరి జలాలు మాత్రమే శరణ‌్యమని నాడు ఆయన పదే పదే చెప్పారు. సముద్రంలో కలిసిపోతున్న వెయ్యి టీఎంసీల నీటిని వినియోగించుకుంటే మేలని మైసూరా రెడ్డి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచించారు.
తొలి నుంచి…..
రాయలసీమ ఎత్తిపోతల పథకం పై తొలి నుంచి మైసూరా రెడ్డి నోరు మెదపడం లేదు. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపునకు తొలి నుంచి ఆయన సుముఖంగా లేరు. గోదావరి జలాలనే రాయలసీమకు మళ్లించాలన్న నినాదాన్నే ఆయన విన్పిస్తున్నారు. అయితే రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో సమావేశాలు పెడుతున్న మైసూరా రెడ్డి ఇటీవల జరుగుతున్న జల వివాదాన్ని పట్టించుకోవడం లేదు. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన నూతన ప్రతిపాదనలపై ఏపీ అంతా నిరసన వ్యక్తమవుతున్నా ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
కొత్త ప్రతిపాదనపై…..
నదీ పరివాహక ప్రాంతం పరిధిని బట్టే నీటి కేటాయింపులు జరగాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెచ్చింది. 811 టీఎంసీలలో 500 టీఎంసీలు తమకే దక్కాలని వాదిస్తుంది. ఇది మరింత వివాదానికి దారితీసేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అండగా నిలవాల్సిన రాయలసీమ పరిరక్షణ సమితి నేత మైసూరారెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. ఇది కరెక్ట్ కాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. సీమ కోసమైనా మైసూరారెడ్డి ముందుకు వచ్చి ఈ కొత్త ప్రతిపాదనపై గొంతు విప్పాలని పలువురు కోరుతున్నారు.