ఆ ప్రపంచ కప్ ను కొన్నామంటున్నారే?

క్రికెట్ అంటే భారత్ ఊగిపోతోంది. 1983 లో కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్ కప్ ను తొలిసారి సాధించి భారత్ సత్తాను చాటిచెప్పింది. ఆ తరువాత 28 [more]

Update: 2020-06-20 17:30 GMT

క్రికెట్ అంటే భారత్ ఊగిపోతోంది. 1983 లో కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్ కప్ ను తొలిసారి సాధించి భారత్ సత్తాను చాటిచెప్పింది. ఆ తరువాత 28 ఏళ్ళ తరువాత 2011 లో ధోని సేన వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడి రికార్డ్ తిరగరాసింది. శ్రీలంక ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసి ఆరువికెట్లు నష్టపోయి 275 పరుగులు భారీ లక్ష్యం ఛేదించాలి. ఆ దశలో సెహ్వాగ్, సచిన్ వంటి హేమాహేమీలు వెనుతిరిగారు . ఇక మ్యాచ్ పై ఆశలు వదులుకున్న దశలో గౌతమ్ గంభీర్, ధోని ధనా ధన్ బ్యాటింగ్ తో కప్ భారత్ సొంతమైంది . మన దేశంలో క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ కి ఆ కప్ ను వీడ్కోలు గా ముంబాయి వాంఖేడ్ లో టీం ఇండియా అందించింది కూడా. అలాంటి చిరస్మరణీయమైన ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశాడు శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహీదనంద.

విమర్శలు, ఆరోపణలు మిన్నంటాయి …

శ్రీలంక మాజీ మంత్రి మహీదనంద 2010 నుంచి 2015 వరకు ఆ దేశ క్రీడల మంత్రిగా పనిచేశారు. ప్రపంచ కప్ ముగిసి 9 ఏళ్ళు అయిన తరువాత ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని ఆయన గోల పెట్టడం దేనికోసం అనే చర్చ మొదలైంది. మాజీ మంత్రి ఆరోపణకు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ కూడా ఇవే ఆరోపణలు చేశారు. కొందరు ఆటగాళ్లు అమ్ముడు పోయి మ్యాచ్ ను భారత్ కి అమ్మేశారని ఆరోపించారు.

ఎన్నికల హడావిడి మొదలయినప్పుడే…..

ఈ ఆరోపణలపై నాటి లంక కెప్టెన్ సంగక్కర, జయవర్ధనే తీవ్రంగానే ఆక్షేపించారు. దేశంలో ఎన్నికలు హడావిడి మొదలైన ప్రతీసారి సర్కస్ ఫీట్లు మొదలౌతాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆరోపించిన వారు ఆధారాలు చూపాలి కదా అని నిలదీశారు. ఇదే రీతిలో గౌతమ్ గంభీర్ లంక మాజీ మంత్రిని కడిగేశారు. ఇన్నేళ్ళ తరువాత ఈ వ్యవహారాన్ని తెరపైకి తేవడం ద్వారా శ్రీలంక పరువును మాజీ మంత్రి తీయడమే కాదు అసలే అంతంత మాత్రం గా ఉన్న క్రికెట్ పై అభిమానుల విశ్వసనీయతను మరోసారి సన్నగిల్లేలా వ్యాఖ్యలు చేసి మరింత అభాసుపాలయ్యారు.

Tags:    

Similar News