మనోహర్ వింత ఆరాటం… ఆలపాటిని కాదనే సీన్ ఉందా?
ఏపీ రాజకీయాల్లో మరోసారి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోందా ? కీలక పార్టీల మధ్య పొత్తుల విషయంలో మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయా ? అంటే.. తాజా [more]
ఏపీ రాజకీయాల్లో మరోసారి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోందా ? కీలక పార్టీల మధ్య పొత్తుల విషయంలో మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయా ? అంటే.. తాజా [more]
ఏపీ రాజకీయాల్లో మరోసారి మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోందా ? కీలక పార్టీల మధ్య పొత్తుల విషయంలో మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయా ? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా జనసేన నాయకులు ప్రస్తుతం బీజేపీతో ఉన్న పొత్తు విషయంలో ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఓట్లు, సీట్లు లేని బీజేపీతో పొత్తుపెట్టుకుని తప్పుచేశామనే భావనలో జనసేన నాయకులు ఉన్నారు. ముఖ్యంగా జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. ఈ విషయంలో చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అసలు జనసేనను బీజేపీ ఓ మిత్రపక్షంగా కూడా చూడడం లేదని తాజా పరిణామాలే చెపుతున్నాయి.
క్లీన్ ఇమేజ్ తో….
ఈ క్రమంలో బీజేపీతో పొత్తును పక్కన పెట్టి.. మళ్లీ టీడీపీ దిశగా అడుగులు వేయాలని ఆలోచన చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకుకు దూరమయ్యే ప్రమాదం ఉందని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నారు. అదే సమయంలో తాను కూడా ఇప్పటికి వరుసగా రెండు సార్లు ఓడిపోవడం కూడా ఆయనను ఆలోచనలో పడేసింది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే స్పీకర్ స్థాయికి ఎదగడంతో పాటు క్లీన్ ఇమేజ్ పొలిటిషీయిన్‌గా ఆయన గుర్తింపు పొందారు.
టీడీపీతో పొత్తు ఉంటేనే….?
అలాంటి నేత పదేళ్లుగా రాజకీయంగా వేసిన స్టెప్పులతో పూర్తిగా నాదెండ్ల మనోహర్ వెనకపడిపోయారు. 2014లో కాంగ్రెస్ నుంచే పోటీ చేసి రాష్ట్ర విభజన దెబ్బతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక గత ఎన్నికల్లో జనసేన నుంచి బరిలో ఉండి మళ్లీ ఓడిపోయారు. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఓట్లతో పాటు సీట్లు కూడా దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని నాదెండ్ల మనోహర్ భావిస్తున్నారు. మరో వైపు గత ఎన్నికల్లో భారీ ఓటమితో అల్లాడిపోతున్న టీడీపీ కూడా జనసేన వైపు మొగ్గు చూపుతోంది.
పొత్తు కుదిరినా….
జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా ఇటీవల వెళ్లి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. ఈ పొత్తు ఫలిస్తే.. రెండు పార్టీలకు బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్నారు. కానీ, రేపు టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. ఈ సీటు మనోహర్‌కు వస్తుందనే గ్యారెంటీ లేకపోవడమే చిత్రమైన విషయం.
అయినా సీటు మాత్రం….?
టీడీపీతో పొత్తు కోసం నాదెండ్ల మనోహర్ తహతహలాడుతున్నా ఆ పార్టీతో పొత్తు కుదిరినా తెనాలిలో మనోహర్‌కు ఛాన్సులు కనపడడం లేదు. టీడీపీకి ఇక్కడ బలమైన నాయకుడిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్‌కు టికెట్ దక్కే అవకాశం కూడా ఉండకపోవచ్చని.. పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఫలించినా.. ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్ ఆశిస్తున్న రాజకీయం ఆయనకు కలిసి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. నాదెండ్ల మనోహర్ కోరిక ఎలా ? ఉన్నా ఈ రాజకీయం ఎలా మారుతుందో ? చెప్పలేం..?