`న‌ల్లమిల్లి` అందరికి దారి చూపించారుగా?

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌లు సైలెంట్‌గా ఉంటున్నారు. ఏదో చంద్రబాబు పిలుపునిస్తే.. ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు త‌ప్ప మిగిలిన స‌మ‌యంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో అస‌లు [more]

Update: 2021-01-05 00:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌లు సైలెంట్‌గా ఉంటున్నారు. ఏదో చంద్రబాబు పిలుపునిస్తే.. ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు త‌ప్ప మిగిలిన స‌మ‌యంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో అస‌లు పార్టీ త‌ర‌ఫున గట్టిగా వాయిస్ వినిపించేవారు క‌నిపించ‌డంలేదు. మ‌రీ ముఖ్యంగా ప్రత్యర్థుల‌ను టార్గెట్ చేస్తున్న ‌వారు కూడా పెద్దగా లేరు. ఈ స‌మ‌యంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి ? అనే విష‌యంలో చంద్ర బాబు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో ప‌ద‌వులు ఇచ్చారు. నాయ‌కులు హోదాలు క‌ట్టబెట్టారు. అయినా.. పెద్దగా ఎవ‌రూ స్పందించ‌డం లేదు.

ఒకే ఒక్క పని….

ఇదిలా వుంటే.. అనూహ్యంగా తూర్పుగోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తిమాజీ ఎమ్మెల్యే న‌ల్లమిల్లి రామ‌కృష్ణారెడ్డి చేసిన ఒకే ఒక్క ప‌ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న వార్తల్లో ప‌తాక శీర్షికల‌కు ఎక్కించ‌డంతో పాటు మిగిలిన టీడీపీ నేత‌ల‌కు దారి చూపింది. 2014లో న‌ల్లమిల్లి ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న భారీ తేడాతో ఓడిపోయాక పూర్తి సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆయ‌న తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆయ‌న్ను రాజ‌కీయంగా హైలెట్ చేసేసింది. అన‌ప‌ర్తి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డిని న‌ల్లమిల్లి టార్గెట్ చేశారు. ఇది రాజ‌కీయంగా ఆయ‌న‌కు, పార్టీకి కూడామంచి హైప్ తీసుకువ‌చ్చింది.

విమర్శల దూకుడుతో…..

ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీకి చెందిన మ‌హిళా నాయ‌కురాలి ఇంటికి దారిని ఎమ్మెల్యే స‌త్తి మూసివేసి ఆమె ఆత్మహ‌త్యకు కార‌ణ‌మ‌య్యారంటూ న‌ల్లమిల్లి రాజ‌కీయంగా టార్గెట్ చేశారు. కర్రి అరుణకుమారి మృతిపై రామకృష్ణారెడ్డి తీవ్రమైన పోరాటం చేశారు. ఇంటికి దారి లేకుండా చేయడంతో ఆమె మనస్థాపంతో మృతి చెందిన విషయాన్ని రామకృష్ణారెడ్డి వెలుగులోకి తెచ్చారు. స్వంత పార్టీకి చెందిన వారు కూడా వైసీపీ ఎమ్మెల్యే వల్ల ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన వెలుగులోకి తెచ్చారు. ఆమె ఆత్మహత్యపై ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని లేకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఇది రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది.

ఎమ్మెల్యేపై విరుచకుపడుతూ….

మ‌రోవైపు ఇటీవ‌ల బిక్కవోలు.. గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో ప్రమాణాల సంగ‌తి మ‌రింత‌గా న‌ల్లమిల్లిని రాజ‌కీయంగా కీల‌కంగా నిల‌బెట్టింది. న‌ల్లమిల్లి రామకృష్ణారెడ్డి, స‌త్తి స‌త్యనారాయ‌ణ‌రెడ్డిపై 16 ఆరోప‌ణ‌లు చేశారు న‌ల్లమిల్లి. అయితే.. అవి తాను చేయ‌లేద‌ని స‌త్తి ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువురు నేత‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగి ప్రమాణాల వ‌ర‌కు చేరింది. దీంతో బిక్కవోలులో ఇద్దరు నేత‌లు ప్రమాణాలు చేసుకున్నారు. ఏదేమైనా.. రాజ‌కీయంగా ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని మంచి చ‌ర్చలోకి తీసుకువ‌చ్చింది. ఇత‌ర నేత‌లు కూడా ఇలా దూకుడుగా ఉంటే.. పార్టీ ఉనికి ప‌దిలంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News