Ycp : ఈ కమ్మ ఎమ్మెల్యేను కాపాడుతుంది కులాలేనా?

వైసీపీ ఎమ్మెల్యే తన నియోజవకర్గంపై పట్టు పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం వైసీీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇప్పుడు [more]

Update: 2021-11-04 15:30 GMT

వైసీపీ ఎమ్మెల్యే తన నియోజవకర్గంపై పట్టు పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం వైసీీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఇప్పుడు అదే టార్గెట్ తో పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పెదకూరపాడును జగన్ కు బహుమతిగా ఇస్తానని ఆయన చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆయన రెండోసారి విజయం సాధిస్తానని అంత ధీమాగా చెప్పడం వెనక కారణాలేంటి అన్న చర్చ జరుగుతోంది.

టీడీపీకి పెద్దగా….

పెదకూరపాడు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. పెదకూర పాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కేవలం మూడు సార్లు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. 2009, 2014లో ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ 1989 నుంచి నాలుగు సార్లు వరసగా విజయం సాధించారు. అలాంటి నియోజకవర్గంలో రెండోసారి తన విజయం ఖాయమని నంబూరి శంకర్రావు గట్టిగా చెబుతున్నారు.

క్యాస్ట్ ఈక్వేషన్లు….

కులాలు ఇక్కడ గెలుపోటములను నిర్దేశిస్తాయి. నంబూరి శంకర్రావు కమ్మ సామాజికవర్గం నేత. ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఓటర్లున్నారు. ఇందులో ఈయన చీల్చుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా 14 వేల రెడ్డి ఓటర్లున్నారు. 41 వేల మంది దళిత ఓటర్లున్నారు. మైనారిటీ ఓట్లు కూడా దాదాపు ముప్పయివేలున్నాయి. ఈ సామాజికవర్గాలతో నంబూరి శంకర్రావు రెండో సారి విజయంపై కూడా ధీమాగా ఉన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నియోజకవర్గాన్ని మార్చాలని చూస్తున్నారు.

ప్రజల వద్దకు….

తాను మరింత బలపడటానికి నంబూరి శంకర్రావు మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గం అంతటా పర్యటిస్తున్నారు. కొన్ని చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి నంబూరి శంకర్రావు ఎలాంటి వివాదాల జోలికి పోలేదు. దీంతో ఇక్కడ తనకు మరసారి ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశమిస్తారని భావిస్తున్నారు. మొత్తం మీద నంబూరి శంకర్రావుకు కులాలే కాపాడతాయని గట్టిగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News