Balakrishna : బావ కళ్లల్లో ఆనందం చూడాలని లేదా?
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే తాను ఉన్న పార్టీని బతికించుకోవాలి. తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలను నమ్ముకోవాలి. ఈ రెండు పనులు నందమూరి బాలకృష్ణ చేయరు. ఆయన దారి వేరే. [more]
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే తాను ఉన్న పార్టీని బతికించుకోవాలి. తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలను నమ్ముకోవాలి. ఈ రెండు పనులు నందమూరి బాలకృష్ణ చేయరు. ఆయన దారి వేరే. [more]
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే తాను ఉన్న పార్టీని బతికించుకోవాలి. తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలను నమ్ముకోవాలి. ఈ రెండు పనులు నందమూరి బాలకృష్ణ చేయరు. ఆయన దారి వేరే. తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన జోక్యం చేసుకోరు. మే లో జరిగిన మహానాడు జూమ్ మీటింగ్ లో కన్పించిన బాలయ్య ఆ తర్వాత అయితా పయితా లేకుండా పోయారు. రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అనుబంధాలను కూడా….
నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే. టీడీపీ లో కీలక నేత. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు బావమరిది. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మేనమామ. పిల్లనిచ్చిన మామ కూడా. ఇన్ని అనుబంధాలను కూడా బాలయ్య పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఇంటి మీద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి సంఘటనపై కూడా బాలకృష్ణ పెదవి విప్పలేదు. ఆ సంఘటన జరిగినట్లు బాలయ్యకు తెలుసో? తెలియదో?
సీమ ప్రాంతంలో…..
సీమ ప్రాంతంలో బాలకృష్ణ కు వీరాభిమానులున్నారంటారు. సీమ ప్రాంతంలోనే బాలయ్య సినిమా ఎక్కువ వసూలు చేస్తుందని కూడా టాక్. అలాంటిది సీమ ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఉన్న అనంతపురం జిల్లాలో తమ్ముళ్ల మధ్య నెలకొన్న విభేదాలను కూడా బాలకృష్ణ లైట్ గానే తీసుకుంటున్నారు. అసలు హిందూపురం వెళ్లడమే మానుకున్నారు.
బావ ఇబ్బంది పడుతున్నా….
ఇక అనేక విషయాల్లో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనన్న ప్లకార్డులు కూడా కనపడుతున్నాయి. అయినా బాలకృష్ణ మాత్రం చంద్రబాబును కాపాడేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పాటు సినిమా టిక్కెట్ల వివాదం విషయంలో కూడా బాలయ్య బాబు దూరంగానే ఉండటం ఇటు ఫిలిం ఇండ్రస్ట్రీలో కాకుండా రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. బాలకృష్ణ సినిమా షూటింగ్ ల వల్లనే రాజకీయాలను పట్టించుకోవడం లేదని చెబుతున్నప్పటికీ ఆయనలో ఏదో ఒక అసంతృప్తి ఉందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.