లోకేష్ తీరే నష్టమా?

క‌డివెడు పాల‌లో ఒక్క ఉప్పుగ‌ల్లు వేసిన‌ట్టుగా ఉంద‌ట టీడీపీలో కీల‌క నాయ‌కుడుగా ఉన్న జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌రిస్థితి. ఇప్పుడు ఇదే విష‌యంపై ఇప్పుడు [more]

Update: 2020-01-27 09:30 GMT

క‌డివెడు పాల‌లో ఒక్క ఉప్పుగ‌ల్లు వేసిన‌ట్టుగా ఉంద‌ట టీడీపీలో కీల‌క నాయ‌కుడుగా ఉన్న జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప‌రిస్థితి. ఇప్పుడు ఇదే విష‌యంపై ఇప్పుడు సొంత పార్టీ నేత‌లంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ప్రధాన ప్రతిప‌క్షం హోదాలో ఉన్న టీడీపీకి ఇప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఎక్కడా క‌నిపించ‌డం లేదు. కానీ, మండ‌లిలో మాత్రం ఇరుకున పెట్టేందుకు అవ‌స‌రమైన బ‌లం ఉంది. అయితే, తాజాగా జ‌రిగిన ప‌రిణామాలో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీలైన్‌కు విరుద్ధంగా వ్యవ‌హ‌రించారు. ప్రతిష్టాత్మకంగా టీడీపీ నేత‌లు భావించిన రాజ‌ధాని బిల్లు స‌హా సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల‌పై మండ‌లి చ‌ర్చించింది.

లోకేష్ ను టార్గెట్ గా….

ఈ సంద‌ర్భంగా ముందు జ‌రిగిన రూల్ 71పై చ‌ర్చలో టీడీపీ నేత‌లు ఓటింగ్ పెట్టిన‌ప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత‌, చ‌డిపిరాళ్ల శివ‌నాథ్‌రెడ్డిలు పార్టీలైన్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. నిజానికి ఇది పార్టీకి తీవ్ర విఘాతంగా మారిపోయింది. మ‌రి ఇలా వ్యవ‌హ‌రించ‌డానికి కార‌ణ‌మేంది. ఇక‌, దీనికి ముందు విషయం చూసినా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే పార్టీలో అంతర్గ తంగా ఏదో లోటు క‌నిపిస్తోంది. పార్టీకి దూర‌మైన ప్రతీ నాయ‌కుడు కూడా లోకేష్‌ను కేంద్రంగా చేసుకునే విమ‌ర్శలు చేస్తున్నారు. గతంలో ఆమంచి టీడీపీలో ఉన్నప్పుడు లోకేషే పోతుల సునీత‌, సురేష్‌ను బాగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆమె కూడా లోకేష్ తీరుపై అస‌హ‌నం వ్యక్తం చేసినట్టు టాక్‌.

అపాయింట్ మెంట్ కూడా…

గతంలో గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ కూడా ఎందుకూ ప‌నికిరాని నాయ‌కులు పార్టీని డిక్టేట్ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. లోకేష్‌ను వంశీ ఎలా టార్గెట్ చేశాడో ? చూశాం. ఇక లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలో కొంద‌రినే ఎంక‌రేజ్ చేయ‌డం, మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేల‌కు క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వక‌పోవ‌డం లాంటి చ‌ర్యల‌తోనే ఇప్పుడు వీళ్లంతా లోకేష్ అంటేనే భ‌గ్గుమంటున్నారు. ఈ ప‌రిస్థితి ఒక్క ఏపీలోనే కాకుండా తెలంగాణ‌లోనూ క‌నిపిస్తోంది. అక్కడ కూడా నాయ‌కులు పార్టీకి దూర మ‌య్యారు.

నచ్చిన వారికే….

అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ త‌న‌కు న‌చ్చిన వారిని మాత్రమే ద‌గ్గరకు తీ సుకుని, పార్టీకోసం ప‌నిచేసిన వారిని క‌నీసంగా కూడా గుర్తించ‌ని ఫలితంగానే నేడు పార్టీ స‌మ‌స్యలు ఎదుర్కొంటోంది. ఆ ప‌రిస్థితి నాడే కాదు ఇప్పుడు కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయినా కొంద‌రు నేత‌లు లోకేష్‌ను క‌లిసేందుకు అపాయింట్‌మెంట్ అడుగుతున్నా ఇవ్వక‌పోవ‌డ‌మో లేదా అపాయింట్‌మెంట్ ఇచ్చినా ఏమ‌వ్వదులే.. లైట్ తీస్కోండి అన్న కామెంట్లు చేయ‌డంతో అస‌లు లోకేష్‌కు భ‌విష్యత్తు రాజ‌కీయాల‌పై ఎలాంటి క్లారిటీ ఉందో ఎవ్వరికి అర్థం కాని ప‌రిస్థితి. లోకేష్ తీరు మార‌క‌పోతే పార్టీ బ‌త‌క‌దనే అభిప్రాయం స‌ర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ‌లో లీడ‌ర‌లు లేరు.. కేడ‌ర్ ఉన్నా న‌డిపించే నాథుడు లేక పార్టీకునారిల్లుతోంది. 2014లో బీజేపీతో క‌లిపి 20 సీట్లు వ‌చ్చాయి. నేడు ప‌రిస్థితి ఘోరంగా ఉంది. సో.. ఇప్పుడు ఇక్కడైనా పార్టీ పంథా మార‌క‌పోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు త‌ప్పవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News