బాధ్యతలు అప్పగించేసినట్లేనా … ??
తెలుగుదేశం పార్టీ భారాన్ని క్రమంగా చంద్రబాబు నారా లోకేష్ పై పెడుతున్నారా ? నారా లోకేష్ యాక్షన్ ఈ సంకేతాలను స్పష్టం చేస్తుంది. వరద సహాయ కార్యక్రమాలకు [more]
తెలుగుదేశం పార్టీ భారాన్ని క్రమంగా చంద్రబాబు నారా లోకేష్ పై పెడుతున్నారా ? నారా లోకేష్ యాక్షన్ ఈ సంకేతాలను స్పష్టం చేస్తుంది. వరద సహాయ కార్యక్రమాలకు [more]
తెలుగుదేశం పార్టీ భారాన్ని క్రమంగా చంద్రబాబు నారా లోకేష్ పై పెడుతున్నారా ? నారా లోకేష్ యాక్షన్ ఈ సంకేతాలను స్పష్టం చేస్తుంది. వరద సహాయ కార్యక్రమాలకు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన నారా లోకేష్ నిస్తేజంగా వున్న కేడర్ ని ఉత్తేజపరిచే పనిలో పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి లో టిడిపి యువరాజు ఘోరపరాజయం పాలయ్యారు. ఆ తరువాత సుమారు నెలరోజులపాటు ట్విట్టర్ కూతకుడా కుయ్యకుండా మౌనం దాల్చారు. ఆ తరువాత అధికార వైసిపి దూకుడుతో ఓటమి బాధనుంచి కోలుకుని తిరిగి యాక్టివ్ అయ్యారు.
బాబులో జోష్ తగ్గింది ….
ఊహించని భారీ ఓటమి తనకు జరుగుతుందని తెలుగుదేశం అధినేత కలలో కూడా అనుకోలేదని ఇటీవల జరిగే అన్ని పార్టీ సమావేశాల్లో వాపోతున్నారు చంద్రబాబు. అరే…. నేనేమి తప్పుచేశానని పాలు ఇచ్చే నన్ను కాదని తన్నే దున్నపోతు కావాలని జనం కోరుకున్నారు వంటి పదునైన పరుష వాఖ్యలు సైతం చంద్రబాబు నుంచి వస్తున్నాయంటే ఆయన ఏ స్థాయిలో అప్ సెట్ అయ్యారో తెలిసిపోతుంది. ఇక ఇలాంటి ఓటమి తరువాత జనం ముందుకు అప్పుడే వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని లెక్కేసుకుని సమస్యలపై పర్యటనల బాధ్యతలు చినబాబుకు అప్పగించేశారు చంద్రబాబు. గతంలో తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇతర ఎలాంటి సందర్భలైనా అక్కడికి క్షణాల్లో రెక్కలు కట్టుకుని వచ్చేవారు బాబు. కానీ ఆయన ఇప్పుడు ప్రజల నిర్ణయాన్నే తప్పుపడుతూ మధన పడుతున్నారు.కొంతకాలం ప్రజలకు దూరంగా పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే నారా లోకేష్ ను రంగంలోకి దించారంటున్నారు.
చినబాబు కు శిక్షణ మొదలైంది ….
దాంతో క్షేత్ర స్థాయిలో వుండే పర్యటనలను క్రమంగా నారా లోకేష్ కే అప్పగిస్తారని కూడా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాలను నారా లోకేష్ పర్యటించడం గమనిస్తే ఇదే విషయం స్పష్టం అవుతుంది. అయితే పార్టీ క్యాడర్ నుంచి, నాయకుల వరకు అధినేత చంద్రబాబు నాయకత్వాన్నే ఇప్పటికి కోరుకుంటున్నారు. అధికారం లో వున్నప్పుడు తప్పదు కనుక నారా లోకేష్ ను భరించాలిసి వచ్చిందని టిడిపి తిరిగి పుంజుకోవాలంటే చంద్రబాబే రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఎన్నికల ఓటమి తరువాత చాలామంది అధినేతకు ఈ విషయం పై క్లారిటీ ఇచ్చినా బాబుకు చినబాబు తప్ప మరో అవకాశం లేకపోవడంతో పుత్రరత్నం పైనే ఆధారపడాలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో అటు అధికార హోదా చూసి ఇప్పుడు విపక్ష హోదాను అనుభవిస్తున్న నారా లోకేష్ చంద్రబాబు వేయబోయే అడుగులు పార్టీ అభివృద్ధికి తీసుకునే చర్యలు ఎలా వుంటాయో పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరం అయ్యింది.