లోకేష్ పిల్ల చేష్టలు పార్టీకీ?

తండ్రి అపర చాణక్యుడు. కొడుకు వారసుడు. అంటే పది మెట్లు సులువుగా ఎక్కేసి తండ్రి పక్కన నిలబడ్డాడన్నమాట. మరి ఆ పది మెట్ల వద్ద ఎదురైన సవాళ్ళు, [more]

Update: 2020-06-19 06:30 GMT

తండ్రి అపర చాణక్యుడు. కొడుకు వారసుడు. అంటే పది మెట్లు సులువుగా ఎక్కేసి తండ్రి పక్కన నిలబడ్డాడన్నమాట. మరి ఆ పది మెట్ల వద్ద ఎదురైన సవాళ్ళు, వాటిని తగిన జవాబు ఇచ్చే మేధస్సు చంద్రబాబు సొంతం. లోకేష్ మాత్రం వేదిక మీద వెలిగిపోతున్నారు కాబట్టి బుర్రకు పదులు పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. కానీ అదే అతి పెద్ద రిస్క్. పది మెట్ల కష్టం కూడా ఒక్కసారి భరించాలి. బుర్రను ఇంకా వేడెక్కించాలి. చూడబోతే లోకేష్ తన భారం కూడా మొత్తం తండ్రి మీదనే వదిలేసినట్లున్నాడు. అందుకే ఈ తిప్పలూ, తప్పులూ.

చిన్నబోయేలా….

పెద్దల సభ అది. అక్కడ ఉండాల్సింది మేధావులు, వయసు మీరిన వారు, ఎందుకంటే వారే ఆలోచనలు చేయగలరు, ఆవేశాన్ని అణచుకోగలరు. ఇక లోకేష్ లాంటి ప్రాంతీయ పార్టీకి భావి నాయకుడిగా ఉన్న వారికి మండలి ప్రవేశమే పెద్ద తప్పు. అక్కడకు వచ్చిన కొత్తల్లో చినబాబు లోకేష్ ఒక మాట అనేవారు. అందరి కంటే వయసులో నేనే చిన్నవాణ్ణి అని. ఇపుడు ఆయన తడబాట్లు పొరపాట్లు వల్లనే పెద్దల సభే చిన్నబోతోంది. చినబాబు ఓవర్ యాక్షన్ కి సీనియర్ నేతలు యనమల రామక్రిష్ణుడు లాంటి వారు కూడా రియాక్షన్ ఇవ్వాల్సివస్తోంది. దీంతో టోటల్ గా రచ్చ అవుతోంది. పార్టీ బొక్క బోర్లా పడుతోంది.

అడ్డంగా బుక్ ….

లోకేష్ మూడేళ్ళుగా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన మంత్రిగా రెండేళ్ళు ఉన్నారు. మరి ఈ మాత్రం అనుభవానికే లోకేష్ కి సభ నియమాలు, నిబంధలను తెలియాలి కదా. కానీ లోకేష్ దూకుడుగా ఉండడమే గొప్ప అనుకుంటున్నారు. అందుకే మండలిలో సభాపతి అనుమతి లేకపోయినా కూడా సెల్ ఫోన్లో వీడియోలు తీయగలిగారు. వాటిని సోషల్ మీడియా దాకా పంపగలిగారు. సోషల్ మీడియాలో ఈ రచ్చ చూస్తే పార్టీలో తన ఇమేజ్ పెరుగుతుందని, పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఆయన అంచనా వేసుకుని ఉంటారు. కానీ జరిగినిది వేరు. సభను చిన్నబుచ్చిన లోకేష్ అడ్డంగా ఇపుడు బుక్ అయ్యారు. ఇదే విషయంతో ఇపుడు వైసీపీ లోకేష్ ని బోనులో నిలబెట్టబోతోంది.

అప్పుడెలా :

సరే ఇవన్నీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో తెలియదు కానీ మండలిలో మరో ఆరు నెలల్లో మార్పులు వస్తున్నాయి. వైసీపీ బలం చాలానే పెరుగుతుంది. లోకేష్ పక్కన ఉన్న వారిలో చాలా మంది ఇంటికి వెళ్ళిపోతారు. అపుడు సౌండ్ తగ్గి సైలెంట్ గా లోకేష్ కూర్చోవాలి. అసెంబ్లీతో పాటు మండలిలో కూడా బలం పెంచుకున్న వైసీపీ చేసే రీ సౌండ్ ని ఆ రోజున లోకేష్ తట్టుకోగలరా. ఇలా అల్లరి చేస్తే అపుడు సభ నుంచి అర్ కే రోజా మాదిరిగా బహిష్కరిస్తే లోకేష‌ ఎలా తట్టుకోగలరు. ఇవన్నీ ఊహించుకోవాలిగా. వచ్చే ఏడాదే ఎన్నికలు, ఆ తరువాత మన సర్కారే అన్నంతగా వెర్రి మొర్రి ఆలోచనలతో నాలుగేళ్లకు పైగా బలమున్న వైసీపీ సర్కార్ మీద రంకెలు వేస్తే కలిగే ఫలమేంటో, ఫలితమేంటో లోకేష్ తొందరలోనే చూస్తారని అంటున్నారు. దూరదృష్టి లేని లోకేష్ దూకుడుకు టీడీపీ కూడా అపుడు ఇబ్బందులో పడాల్సిఉంటుంది.

Tags:    

Similar News