అందరి ఆందోళన అదే.. చినబాబు రైజ్ అవుతారా?
అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్న సామెత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఖచ్చితంగా సరిపోతుంది. రాజకీయాల్లోకి ఎంట్రీకాగానే లోకేష్ కు [more]
అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్న సామెత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఖచ్చితంగా సరిపోతుంది. రాజకీయాల్లోకి ఎంట్రీకాగానే లోకేష్ కు [more]
అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్న సామెత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఖచ్చితంగా సరిపోతుంది. రాజకీయాల్లోకి ఎంట్రీకాగానే లోకేష్ కు అన్నీ ఉన్నాయి. ఇటు డబ్బు, అటు పేరు ప్రతిష్ట.. తండ్రి ముఖ్యమంత్రి. తాత ఎన్టీఆర్ హయాంలో ఉన్న బలమైన ఓటు బ్యాంకు. గ్రామ గ్రామాన పటిష్టమైన క్యాడర్. దశాబ్దకాలాల పాటు ఏలిన పార్టీకి వారసత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే నారా లోకేష్ కు వచ్చిన అవకాశాలు రాజకీయాల్లో మరెవ్వరికీ రాలేదు. జగన్ రాజకీయ వారసత్వం ఉన్నా ఆయన కొత్త పార్టీని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా అన్నీ ఉన్న నారా లోకేష్ కు ఏదీ కలసి రావడం లేదు.
మంత్రిని చేయకముందే..?
చంద్రబాబు బెంగంతా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ మీదే. ఒకసారి మంత్రి అయిన వెంటనే నారా లోకేష్ ఇక మాట వినని స్థితికి చేరుకున్నారట. తండ్రి సూచనలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్నది పార్టీ వర్గాల టాక్. అసలు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ను మంత్రిని చేయాలని ఇటు కుటుంబ పరంగా, అటు పార్టీలో ఉన్న కొద్దిమంది అనుచరుల నుంచి చంద్రబాబుపై వత్తిడి ఎదురయింది. అయితే అప్పుడే వద్దని, ముందు పార్టీ నేతగా ప్రజల్లో తిరిగి వచ్చిన తర్వాత చూద్దామని చంద్రబాబు చెప్పి చూసినా ఫలితం లేదు. వత్తడి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో నారా లోకేష్ ను మంత్రిని చేయాల్సి వచ్చిందన్నారు.
నాయకుడిగా మలచాలని….
అయితే అధికారం కోల్పోయిన తర్వాత నారా లోకేష్ ను నాయకుడిగా మలచాలన్న చంద్రబాబు ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయంటున్నారు. ఆయన తన కోటరీకే పరిమితమై ఎవరినీ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో తిరగకుండా కేవలం ట్విట్టర్ కే పరిమితం కావద్దని చేసిన సూచనలను కూడా పట్టించుకోవడం లేదు. లోకేష్ తో మరో ప్లాబ్లం ముందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆయనను జిల్లాల పర్యటనలకు పంపినా కొందరి నేతలకే ప్రాధాన్యమిస్తారన్న ప్రచారం కూడా పార్టీలో ఉంది. దీనివల్ల జిల్లాల్లో లోకేష్ గ్రూపు, చంద్రగ్రూపులుగా మారిపోవడం కూడా పార్టీ అధినేతను కలవరపరుస్తుంది.
అదే అందరి ఆందోళన…
దీంతో చంద్రబాబుకు లోకేష్ ఫీవర్ పట్టుకుంది. కొందరు సీనియర్ నేతలు సయితం లోకేష్ జిల్లాల పర్యటన లో జరిగిన విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారట. అందుకే యువతను లక్ష్యంగా చేసుకుని పర్యటనలు చేయాలని చంద్రబాబు లోకేష్ కు సలహా ఇచ్చారు. దీంతో త్వరలోనే లోకేష్ యూత్ సదస్సులతో పర్యటనలు చేయనున్నారు. యూనివర్సిటీల్లో పర్యటించి విద్యార్థులను ఆకట్టుకోవాలన్నది లోకేష్ ఆలోచనగా ఉంది. అయితే ఎంత చేసినా లోకేష్ నాయకత్వం పై మాత్రం నాయకుల్లో నమ్మకం లేదు. ఈ విషయం ఇటీవల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో రేవంత్ రెడ్డిని కలసినప్పుడు కూడా వారి సంభాషణల్లో లోకేష్ గురించే ఆందోళన కన్పించింది.