లోకేష్ ని చెడగొడుతోంది ఎవరు.. ?

నాయకుడు అన్న వాడు జనం నుంచి రావాలి. అక్కడే తయారు కావాలి. ఏపీలో వర్తమాన రాజకీయాలను తీసుకుంటే జగన్ అన్న నాయకుడు జనం నుంచే వచ్చారు. ఆయన్ని [more]

Update: 2021-08-11 15:30 GMT

నాయకుడు అన్న వాడు జనం నుంచి రావాలి. అక్కడే తయారు కావాలి. ఏపీలో వర్తమాన రాజకీయాలను తీసుకుంటే జగన్ అన్న నాయకుడు జనం నుంచే వచ్చారు. ఆయన్ని తండ్రి వైఎస్సార్ నేరుగా ప్రజలకు పరిచయం చేయలేదు. జస్ట్ ఎంపీగా టికెట్ ఇచ్చారు. ఆ తరువాత ఏం జరిగేది అన్నది తెలియకపోయినా వైఎస్సార్ వ్యవహార శైలిని ఎరిగిన వారికి మాత్రం ఆయన జగన్ని అంతా తానై ప్రమోట్ చేస్తారని అసలు ఊహించలేరు. ఇక వైఎస్సార్ సరిసాటి నేతగా చంద్రబాబు ఉన్నారు. ఆయన కుమార రత్నం నారా లోకేష్ ని పుడుతూనే భావి సీఎం గా అనుకునేలా చంద్రబాబు పెంచారా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి.

నీడ బలంగానే..?

సాధారణంగానే ఎవరి మీద అయినా ఇంట్లో వారి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అలా నారా లోకేష్ కి చంద్రబాబు ప్రభావం గట్టిగా ఉంటుంది. పైగా బాబు పేరొందిన రాజకీయ నాయకుడు కావడంతో లోకేష్ కి అది మొదట్లో వరం అయినా తరువాత పోనూ పోనూ శాపం అవుతోంది. చంద్రబాబు అనగానే క్రెడిబిలిటీ మీద సందేహాలు ఉంటాయి. ఆయన తన మామకు పొడిచిన వెన్నుపోట్లు గుర్తుకువస్తాయి. అధికారం కోసం ఎందాకైనా అంటూ చేసే రాజకీయ విన్యాసాలు కళ్ల ముందు కదులుతాయి. అలా చంద్రబాబు రాజకీయ అదృష్టవంతుడిగా చాలా షార్ట్ కట్ మెదడ్స్ లో పవర్ ని ఎక్కువసార్లు అందుకున్నారు. మరి దాన్ని చూసిన నారా లోకేష్ కూడా అలాగే ప్రభావితం అవుతున్నారా అన్నదే చర్చ.

వాట్సాప్ సందేశం….

ఈ మధ్యన ఏపీ సీఐడి వారు చేసిన దర్యాప్తులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు చంద్రబాబుతో, చినబాబు తో జరిపిన వాట్సాస్ చాటింగుని బయటపెట్టారు. అందులో సంచలనమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూడాల్సింది న్యాయ వ్యవస్థ మీద నారా లోకేష్ చేశారని చెబుతున్న కామెంట్స్. ఇది లోకేష్ లాంటి యువ నాయకుడికి తగిన పనేనా అన్న చర్చ అయితే ఉంది. బాబు అయితే డెబ్బై దాటిన నేత. ఆయన రాజకీయం, పదవులు అన్నీ కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మరి నారా లోకేష్ ఈనాటి నాయకుడు. ఆయన తన తండ్రి మాదిరిగా కాకుండా వేరేలా ఆలోచనలు చేయాలని టీడీపీతో పాటుగా అందరూ కోరుకుంటారు. కానీ జరుగుతున్నదేంటి.

ఇదే అలవాటుగా…..

అధికారం అయినా మరోటి అయినా షార్ట్ కట్స్ లో దక్కవు. అందరూ చంద్రబాబులా లక్కుని తొక్కి రారు. ఆ సంగతి అర్జంటుగా లోకేష్ తెలుసుకోవాలి. లేదా ఎవరైనా తెలియచేయాలి. కానీ చిత్రమేంటి అంటే నారా లోకేష్ కి కళ్ళ ముందు ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు కనిపిస్తూండగా వాటిని కాదనుకు ఎత్తులకు, కుటిల వ్యూహాలకే పరిమితం కావడం. ఈ విషయంలో కూడా ఎవరెన్ని చెప్పుకున్నా చంద్రబాబుకు సరిసాటి ఎవరూ లేరు. మరి నారా లోకేష్ ఎంత ఆయాసపడినా తండ్రి మాదిరిగా అపర చాణక్య రాజకీయం చేయలేరు. మరి అలాంటపుడు జనాల్లోకి వెళ్ళి తేల్చుకోవాల్సిన యువనేతను చెడగొడుతోంది ఎవరు. అయిన వాళ్ళు అయినా సన్నిహితులు అయినా కూడా నారా లోకేష్ పొలిటికల్ రూట్ ఇది కాదు అని చెప్పకపోతే మాత్రం ఆయనకే కాదు అది టీడీపీకి కూడా తీరని నష్టమే చేస్తుందనుకోవాల్సిందే.

Tags:    

Similar News