చాలా చేయాలి.. చాలా నేర్చుకోవాలి కూడా…?

చినబాబు ట్యాగే లోకేష్ కి బాగున్నట్లుంది, ప్రత్యర్ధులకు కూడా అదే బాగా నచ్చుతోంది కూడా. అవును పదేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా కూడా ఇంకా లోకేష్ చినబాబే [more]

Update: 2021-03-28 02:00 GMT

చినబాబు ట్యాగే లోకేష్ కి బాగున్నట్లుంది, ప్రత్యర్ధులకు కూడా అదే బాగా నచ్చుతోంది కూడా. అవును పదేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా కూడా ఇంకా లోకేష్ చినబాబే మరి. లేకపోతే మంత్రిగా ఉన్నపుడు అంబేద్కర్ జయంతికి వర్ధంతికి తేడా లేకుండా ఏదేదో మాట్లాడేశారు. అంతకు ముందు అవినీతి అక్రమాల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ మాత్రమే అని టంగ్ స్లిప్ చేసేశారు. ఇపుడు వైసీపీ రెండేళ్ళ పాలనకు దగ్గర పడుతున్న వేళ తొడగొట్టి టీడీపీని నిలబెట్టాల్సిన టైమ్ లో సైతం ఇంకా తడబాట్లూ పొరపాట్లూ చేసుకుంటూ చినబాబు వైసీపీకి అడ్డంగా దొరికిపోతున్నారు.

చరిత్ర ఎందుకు బాబూ…?

అదే సినిమాలో విలన్ పాత్రధారి అంటాడు, చరిత్ర అడక్కు చెప్పింది విను అని. అలా గత చరిత్రలు చెప్పడానికే చినబాబు ఎపుడూ ఇష్టపడతారు. తీరా చూస్తే హిస్టరీలో మరీ వీకాయే. దాంతోనే తేడా వచ్చేస్తోంది. వాజ్ పేయ్ 1998లో దేశానికి ప్రధాని అయితే చినబాబు మాత్రం 1978లో వాజ్ పేయ్ ప్రధాని అయ్యారంటూ ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. అంతే కాదు ప్రత్యేక హోదా విషయంలోనూ ఏదేదో మాట్లాడేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం పోస్కోకు ఇవ్వాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించినపుడు, 2018లో విశాఖలోని ప్లాంట్ కి పోస్కో బృందం వచ్చినపుడు చంద్రబాబే ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మరచి మరీ ఉక్కు మీదే కొత్త లెక్కలతో లోకేష్ రచ్చ చేయడం కూడా టీడీపీకి బూమరాంగే అవుతోంది మరి.

ఫోకస్డ్ గా స్పీచ్ ….

ఒక్కో నాయకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. చంద్రబాబు అయితే అలా ముందుకు పోదాం అంటూ విక్టరీ సింబల్స్ తో జనాలను ఆకట్టుకుంటారు. వైఎస్సార్ చేయి ఊపుడుకు ఉమ్మడి ఏపీ ప్రజానీకం ఫిదా అయిపోయేది. ఇక జగన్ రెండు చేతులూ జోడించి నలు వైపులా జనాలను చూస్తూ చేసే నమస్కార బాణానికి ప్రజలు హుషారెత్తుతారు. మరి లోకేష్ కూడా తన బాడీ లాంగ్వేజ్ ని అలా సెట్ చేసుకోకపోవడం ఇప్పటికీ ఒక లోటే. అంతే కాదు, జగన్ కి ఒక స్పెషల్ స్టైల్ ఆఫ్ స్పీచ్ ఉంది. లోకేష్ కూడా అలా తనకంటూ ప్రత్యేకతను చూపించాల్సి ఉంది. కానీ చినబాబు ఆవేశపూరితమైన ప్రసంగం చేస్తూ పోతారు. పైగా అవన్నీ అప్పగించినట్లుగా ఉంటుంది. జనాలు అనుసరిస్తున్నారా లేదా అన్న ఆలోచన కూడా ఉండదు అంటారు. ఫోకస్డ్ గా స్పీచ్ ఉంటేనే నాయకుడి పట్ల జనాలకు ఆకర్షణ ఏర్పడుతుంది అన్నది ఇప్పటికీ చినబాబు లోకేష్ గుర్తించలేకపోతున్నారు.

ఎదురీతే మరి….

వైసీపీ ఏపీలో ఇపుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అధికారం చేతిలో ఉంది. జగన్ వంటి దూకుడు కలిగిన నేత సీఎం గా ఉన్నారు. ఇలాంటి నేపధ్యంలో జగన్ మీద నుంచి జనాల ఏకగ్రతను తన వైపు తిప్ప్పుకోవాలంటే లోకేష్ చాలా చేయాల్సి ఉంటుంది. అలాగే చాలా నేర్చుకోవాలి కూడా. అయితే లోకేష్ అర్జంటు గా తండ్రి అంతటి నేత కావాలని ఉబలాటపడుతున్నారు. జగన్ తో పోటీ పెట్టుకుంటున్నారు. అక్కడే తేడా కొట్టేసి గ్రాఫ్ పడిపోతోంది. మరి లోకేష్ ఇకనైనా సొంత రిపేర్లు చేసుకుని జనంలోకి వస్తేనే ఫ్యూచర్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతాడు అన్నది మాత్రం నిజం.

Tags:    

Similar News