లోకేష్ తిరుప‌తి బై పోల్ అందుకు వాడుకుంటున్నారా ?‌

తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ కం‌గా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా డిజిట‌ల్ ప్రచారాన్ని ఆయ‌న [more]

Update: 2021-04-14 13:30 GMT

తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మ కం‌గా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా డిజిట‌ల్ ప్రచారాన్ని ఆయ‌న విస్తృతం చేశారు. అదేవిధంగా పార్టీలో యువ‌త‌ను ప్రతి విష‌యంలోనూ భాగ‌స్వాముల‌ను చేశారు. వారిని ముందుండి న‌డిపిస్తున్నారు. తిరుప‌తి గెలుపు పార్టీకి అత్యంత అవ‌స‌రం. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీకి ఎదురైన అనుభ‌వం నుంచి తేరుకుని.. నాయ‌కుల‌ను, యువ‌త‌ను ముందుకు న‌డిపించాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంది. అందునా.. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో సెంటిమెంటు లేకపోవ‌డం.. కూడా టీడీపీకి ఇబ్బందిగానే ఉంది.

డిజిటల్ ప్రచారంతో….

ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఎన్నిక‌లో ఆ కుటుంబానికి జ‌గ‌న్ టికెట్ ఇవ్వలేదు. సో.. ఇక్కడ సెంటిమెంటు ప‌వ‌నాలు లేవు. కాబ‌ట్టి.. వైసీపీ గెలిచినా.. సానుభూతితోనే గెలిచింది అనే మాట చెప్పే అవ‌కాశం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే.. నారా లోకేష్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల నియ‌మించిన పార్టీ రాష్ట్ర క‌మిటీ టీంను అంతా ఇప్పటికే తిరుప‌తిలో దింపేశారు.. వ‌చ్చే 15 రోజులు.. ప్రతి ఇంటికీ.. ఆ సైన్యం వెళ్లి.. ప్రచారం తీవ్రం చేస్తుంది. మ‌రోవైపు డిజిట‌ల్ ప్రచారం.. వాట్సాప్ , ట్విట్టర్‌, ఫేస్ బుక్‌.. ఇలా అన్ని ర‌కాల మాధ్యమాల్లోనూ ప్రచారం సాగుతుంది.

ప్రత్యేక ఆకర్షణగా….

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో యువ‌త ఆలోచించి ఓట్లు వేస్తే టీడీపీ పుంజుకుంటుంద‌ని నారా లోకేష్ పార్టీ నేత‌ల స‌మావేశాల్లో ప‌దే ప‌దే చెపుతున్నారు. ఫ‌లితంగా యువ‌త ఓట్లు టీడీపీ వైపు మ‌ళ్లేలా వ్యవ‌హ‌రించ‌డం వంటివి నారా లోకేష్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలుగా టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇవే కాకుండా.. అనుకూల మీడియాలోనూ త‌న‌దైన శైలిలో వ్యాఖ్యలు ప్రచారం అయ్యేలా చేయాల‌ని అను కుంటున్నారు.

యువతను ఆకట్టుకునేందుకు….

ఇక‌, యువ‌త‌ను త‌న‌వెంట తిప్పుకొని.. ప్రచారంలో ప్రత్యేక ఆక‌ర్షణ‌గా మారాల‌ని నిర్ణయించుకున్నారు. అలాగే త‌న తాత‌.. పార్టీ వ్యవ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ మాదిరిగా పూర్తిగా ఖాకీ దుస్తులు ధ‌రించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇలా ఏదో ఒక రూపంలో త‌న‌కంటూ ప్రత్యేక‌త‌ను చాటుతూ.. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో నాయ‌కుడిగా తాను మ‌రింత రాటుదేలడంతో పాటు ఇక్కడ పార్టీని గెలిపిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టానిక్ మాదిరిగా ప‌నిచేస్తుంద‌ని నారా లోకేష్ భావిస్తున్నట్టు స‌మాచారం. మ‌రి లోకేష్ ప్రయ‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.

Tags:    

Similar News