లోకేష్ కి మామూలుగా లేదుగా
తెలుగుదేశం పార్టీ భావి రధసారధి నారా లోకేష్ కి కవరేజ్ బాగా పెంచింది పసుపు మీడియా. జనంలో మమేకం కాకుండా ట్విట్టర్ పక్షిగానే లోకేష్ ఉంటారన్న విమర్శల [more]
తెలుగుదేశం పార్టీ భావి రధసారధి నారా లోకేష్ కి కవరేజ్ బాగా పెంచింది పసుపు మీడియా. జనంలో మమేకం కాకుండా ట్విట్టర్ పక్షిగానే లోకేష్ ఉంటారన్న విమర్శల [more]
తెలుగుదేశం పార్టీ భావి రధసారధి నారా లోకేష్ కి కవరేజ్ బాగా పెంచింది పసుపు మీడియా. జనంలో మమేకం కాకుండా ట్విట్టర్ పక్షిగానే లోకేష్ ఉంటారన్న విమర్శల నేపథ్యంలో సమయం కోసం చూస్తున్న పార్టీ అధిష్టానానికి రాజధాని ఉద్యమం రూపంలో ప్రస్తుతం అవకాశం లభించింది. దాంతో నిత్యం అమరావతి లోనే రాజధాని ఉండాలనే అంశంపై సుదీర్ఘ పోరాటం లోకేష్ కి కలిసి వచ్చేలా టిడిపి మీడియా కార్యాచరణ రూపొందించి అమల్లో పెట్టేసింది. చినబాబు అడుగు తీసి అడుగు వేస్తే చాలు చంద్రబాబు ను మించిన కవరేజ్ లోకేష్ వైపే సాగడం చర్చనీయం అవుతుంది. రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనడం, మీడియా తో గంట గంటకి చిట్ చాట్ లు, మరో పక్క సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఇప్పుడు చినబాబు చేయాలిసిన పని.
మంగళగిరి లో మళ్ళీ గెలిచేందుకేనా …
రాజధాని ప్రాంతంలో ఘోరంగా ఓటమి పాలై ఏపీ లో అవమానానికి గురయ్యారు గత ఎన్నికల్లో నారా లోకేష్. ప్రజల నుంచి ఆయన నేరుగా గెలవలేరనే చంద్రబాబు తనయుడిని దొడ్డి దారిన ఎమ్యెల్సీ చేశారాన్న విమర్శలకు ఆ ఓటమితో మరింత ప్రచారం లభించేలా మారింది. అందుకే ఎక్కడ ఓడిపోయారో ఆయన అక్కడినుంచే గెలిచే వాతావరణం రాజధాని మార్పు నిర్ణయంతో ఏర్పడిందని గుర్తించి ఈ ఉద్యమాన్ని తన రాజకీయ భవిష్యత్తుకి పునాదిగా మార్చుకోవాలని లోకేష్ స్కూల్ గట్టి నిర్ణయం తో ఉన్నట్లు పార్టీ మీడియా వర్గాల్లో జోరుగా టాక్ సాగుతుంది.
అత్యధిక ప్రాధాన్యం….
అందుకే ఎల్లో మీడియా సైతం చినబాబు కార్యక్రమాలను ఏ ఒక్కటి మిస్ కాకుండా కవర్ చేయడంతో బాటు ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే పనిలో చాలా బిజీగా పడిపోయింది అని సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది. అయితే చినబాబు ను ఎంత హైలైట్ చేసినా పార్టీకి మైలేజ్ దక్కేది మాత్రం పెద్దగా ఏమి వుండబోదన్న అంశం చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబు వ్యూహాలు, పోరాట వైఖరిలో పదో వంతు కూడా చినబాబులో లేవని కూడా పార్టీ వర్గాల్లో కొందరు ఆఫ్ ది రికార్డ్ గా పెదవి విరవడం గమనార్హం. టిడిపి కి తిరిగి జవసత్వాలు రావడానికి ఓపిక ఉన్నంత వరకు చంద్రబాబు నాయకత్వమే శరణ్యమని వాపోతుండటం విశేషం.