చినబాబును అందుకే వ‌ద్దనుకుంటున్నాం.. సీనియ‌ర్ల సంచ‌ల‌నం

కొన్ని విష‌యాలు చాలా గోప్యంగా ఉంచుతారు. వాటిని చూచాయ‌గా వెల్లడిస్తారు. దానిని బ‌ట్టి నేత‌లు అర్ధం చేసుకోవాలి. కానీ, అప్పటికీ అర్ధం కాక‌పోతే.. అస‌లు విష‌యం ఏదో [more]

Update: 2021-05-11 06:30 GMT

కొన్ని విష‌యాలు చాలా గోప్యంగా ఉంచుతారు. వాటిని చూచాయ‌గా వెల్లడిస్తారు. దానిని బ‌ట్టి నేత‌లు అర్ధం చేసుకోవాలి. కానీ, అప్పటికీ అర్ధం కాక‌పోతే.. అస‌లు విష‌యం ఏదో ఒక రోజు బ‌య‌ట ప‌డ‌కుండా ఉండ‌దు. ఇప్పుడు అదే టీడీపీలో జ‌రిగింది. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి, చంద్రబాబు త‌న‌యుడు నారా లోకేష్‌ ను ఆదిలో ఆహ్వానించిన టీడీపీ నాయ‌కులు త‌ర్వాత ఆయ‌న‌ను ప‌క్కన పెడుతున్నారు. ఆయ‌న వ‌ద్దు బాబోయ్ అనేస్తున్నారు. ఆయ‌న జిల్లాల ప‌ర్యట‌న‌ల‌కు వ‌చ్చినా.. లేక ఏదైనా కార్యక్రమం పెడుతున్నా.. మొక్కుబ‌డిగా మాత్రమే స్పందిస్తున్నారు.

వ్యతిరేకత పెద్దగా లేదు కానీ.?

దీనికి కార‌ణం ఏంటి? అనేది ఇప్పటి వ‌ర‌కు పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది. అయితే.. ఇప్పుడు నేత‌లు ఒక్కొక్కరుగా బ‌రస్ట్ అవుతున్నారు. “ఆయ‌న‌పై మాకు పెద్దగా వ్యతిరేక‌త ఏమీలేదు. మా నాయ‌కుడి కుమారుడిగా ఆయ‌న‌కు ఎప్పుడూ మా మ‌న‌సులో చోటు ఉంటుంది. ఆయ‌న విష‌యంలో మాకు గౌర‌వం కూడా ఉంది. కానీ, పార్టీ దెబ్బ తిన‌కూడ‌ద‌న్నదే మాట ఆలోచ‌న‌.“ అని గుంటూరుకు చెందిన మాజీ మంత్రి ఒకరు చెప్పుకొచ్చారు. కొన్నాళ్లుగా నారా లోకేష్‌ చేస్తున్న కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, తూర్పుగోదావ‌రికి చెందిన నేత అయితే.. ఏకంగా 'ఎవ‌రో రావాలి.. పార్టీని బ‌తికించాలి' అని కూనిరాగాలు సైతం పాడుతున్నారు.

వ్యూహాలు లేకపోవడం…

అయితే.. దీనికి ప్రధాన కార‌ణం.. గ‌త ఎన్నిక‌ల‌కుముందు.. రెండేళ్లపాటు.. పార్టీని త‌న చేతుల్లోకి తీసుకుని .. త‌న నిర్ణయాలే శాస‌నంగా నారా లోకేష్‌ అమ‌లు చేశారని.. ఆయ‌న చెప్పు చేత‌ల్లో తాము ప‌నిచేశామ‌ని.. ఆయ‌న ఏం చెప్పినా.. ఏం చేసినా.. త‌లాడించామ‌ని.. కానీ, లోకేష్ వ్యూహాలు ఏమ‌య్యాయో.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. స్పష్టం కాలేదా? అని ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన ఓ మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక‌, మ‌రికొంద‌రు కూడా ఇదే వ్యాఖ్యలుచేస్తున్నారు. నారా లోకేష్‌ అంటే.. తమ‌కు వ్యతిరేక‌త లేదంటూనే.. ఆయ‌న వ్యూహాల‌ను విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న వ్యూహాలు విఫ‌లం కావ‌డం వ‌ల్లే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌ని చెబుతున్నారు.

జగన్ ను ఢీకొట్టే….

అంతేకాదు.. జ‌గ‌న్‌ను ఢీ కొట్టాలంటే నారా లోకేష్‌ వ్యూహాలు స‌రిపోవ‌ని అంటున్నవారు కూడా క‌నిపిస్తున్నారు. ఇక‌, ఆయ‌నతో క‌ల‌సి ప‌నిచేస్తామ‌ని చెబుతున్న క‌డ‌ప నేత‌లుకూడా వ్యూహాలు మాత్రం వ‌ద్దని.. చెబుతున్నారు. కొన్ని విష‌యాల్లో మాత్రం లోకేష్ జోక్యం చేసుకోకుండా ఉంటేనే బెట‌ర్ అని చెబుతున్నారు. “ఆయ‌న మ‌మ్మల్ని ప‌ట్టించుకోరు. మాకు కూడా కొన్ని స‌ల‌హాలు ఉంటాయి. వాటిని చెబుతామంటే.. క‌నీసం అవ‌కాశం ఇవ్వరు. ఇలా అయితే.. ఎలా? “ అని అనంత‌పురానికి చెందిన యువ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా లోకేష్‌ ను కాద‌నే వారు లేక‌పోయినా.. ఆయ‌న వ్యూహాల‌ను మాత్రం త‌ప్పుప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News