ఇక‌.. లోకేష్‌కు ద‌బిడి దిబిడేనా..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ప‌ప్పులు ఇక ఉడ‌క‌వా ? ఆయ‌న‌కు చెక్ పెట్టడం ఖాయ‌మేనా ? ముఖ్యంగా ఇప్పటి వ‌రకు [more]

Update: 2021-07-03 13:30 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ప‌ప్పులు ఇక ఉడ‌క‌వా ? ఆయ‌న‌కు చెక్ పెట్టడం ఖాయ‌మేనా ? ముఖ్యంగా ఇప్పటి వ‌రకు శాస‌న మండ‌లిలో బ‌లంగా ఉన్న టీడీపీకి ఇప్పుడు మెజారిటీ త‌గ్గిపోయింది. దీంతో వైసీపీ దూకుడు పెరిగే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. దీంతో వైసీపీదే శాస‌న స‌భ‌లో పైచేయిగా ఉంది. ఆ పార్టీకి 151 + 5 జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా క‌లుపుకుంటే 156 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. దీంతో టీడీపీ నేత‌లు ఎంత‌గా దూకుడు చూపించాల‌ని అనుకున్నా.. ప్రయోజ‌నం లేక‌పోగా.. వైసీపీ ధాటికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు విల‌విల్లాడుతున్నారు.

అనేక బిల్లుల విషయంలో….?

ఇక‌, మండ‌లి విష‌యానికి వ‌స్తే..నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీదే పైచేయిగా ఉంది. ఎక్కువ మంది స‌భ్యులు ఉండ‌డంతో వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల‌పై టీడీపీ మండ‌లిలో తీవ్ర వ్యతిరేక‌త వ్య‌క్తం చేస్తోంది. ఈ క్రమంలోనే మూడు రాజ‌ధానులు, సీఆర్‌డీఏ త‌దిత‌ర బిల్లుల విష‌యంలో మండ‌లిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్ స‌హా ప‌లువురు టీడీపీ నేత‌లు, వైసీపీ ఎమ్మెల్సీల మ‌ధ్య ఫైట్ కూడా సాగింది. దీంతో.. టీడీపీ – వైసీపీ మ‌ధ్య.. తీవ్రస్థాయిలో స‌మ‌రం సాగుతూనే ఉంది. మంత్రి వెలంప‌ల్లిపై చేయి చేసుకున్నార‌ని వైసీపీ ఆరోపించ‌డం తెలిసిందే.

చినబాబు దూకుడుకు…?

అయితే ఇప్పుడు మారిన ప‌రిస్థితి నేప‌థ్యంలో టీడీపీపై వైసీపీ పంతం నెగ్గించుకునే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ యువ నాయ‌కుడు, లోకేష్ మండ‌లి వేదిక‌గా కాస్త దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పడు వైసీపీకి ఫుల్లు మెజారిటీ వ‌చ్చిన నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా లోకేష్ దూకుడుకు బ్రేకులు వేస్తార‌ని వైసీపీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఆయనే టార్గెట్ గా…..

ఇప్పటికే బ‌య‌ట వైసీపీ ప్రభుత్వంపై విమ‌ర్శలు చేసేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశం కూడా లోకేష్ వ‌దులుకోవ‌డం లేదు. ఈ క్రమంలోనే వైసీపీ నేత‌లు లోకేష్‌ను గ‌ట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మండ‌లిలో బ‌లం పెరిగింది.. అటు మండ‌లి చైర్మన్ కూడా వైసీపీ నేతే ఉండ‌నున్నారు. ఈ క్రమంలో ఖ‌చ్చితంగా లోకేష్‌కు చెక్ పెడ‌తారని.. ఇప్పటిలా గా ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి లోకేష్‌ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News