కిక్కు అంటే ఏందో అర్థమయిందా?

ఏదైనా క్రైసిస్ లో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లీడర్ గా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన [more]

Update: 2021-07-24 06:30 GMT

ఏదైనా క్రైసిస్ లో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లీడర్ గా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఆయకు ఈ అవకాశం లభించింది. అయితే ఆయన తొలి నాళ్లలో కొంత తడబడినా ఇప్పుడిప్పుడే అన్ని రకాలుగా పుంజుకుంటున్నారన్నది పార్టీ నేతల అభిప్రాయం. నారా లోకేష్ ఈ మూడేళ్లలో మరింత పరిణితి సాధించగలిగితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా ఎవరికి అభ్యంతరం ఉండదు.

తన టీమ్ కే…..

నారా లోకేష్ తొలి నుంచి తన టీమ్ కే పరిమితమయ్యే వారు. తనకంటూ ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని వారిచ్చే సలహాలు, సూచనలతోనే వెళ్లారు. సీనియర్లను పట్టించుకోలేదు. అది రాజకీయంగా కొంత ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడిప్పుడే నారా లోకేష్ తనకు చిక్కిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు. తండ్రి చంద్రబాబు ఎటూ ఇమేజ్ ఉన్న లీడర్ కావడంతో ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు.

పరీక్షల రద్దుతో…..

నారా లోకేష్ మాత్రం యువతను టార్గెట్ చేశారు. ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని అధికార పార్టీపై పెద్ద యుద్ధమే చేశారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగిరావడం నారా లోకేష్ కు అనుకూలంగా మారింది. వీరంతా భవిష్యత్ ఓటర్లని, వారిని టీడీపీ వైపు మళ్లించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారని టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. పరీక్షల రద్దు నారా లోకేష్ విజయమంటూ మార్మోగడంతో ఆయనకు రాజకీయ కిక్కు అంటే ఏందో అర్థమయిం దంటున్నారు.

జాబ్ క్యాలెండర్ పై….

ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు ఏపీలో ఆందోళన చేస్తున్నారు. దీంతో నారా లోకేష్ నిరుద్యోగులకు అండగా నిలవాలనుకుంటున్నారు. కరోనా కొంత తగ్గుముఖం పట్టిన వెంటనే నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్చువల్ గా కాకుండా తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం, విజయవాడ వంటి ప్రాంతాల్లో నిరుద్యోగ యువతతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్న యోచనలో నారా లోకేష్ ఉన్నారు. మొత్తం మీద నారాలోకేష్ యువతనే టార్గెట్ గా చేసుకుని మందుకు వెళుతున్నారు.

Tags:    

Similar News