కత్తి.. డాలు… లేవట.. అన్నీ వదిలేసినట్లేనట

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. లీడర్ షిప్ అనేది వారసత్వంగా వచ్చేది కాదు. అది పదవులు పొందేందుకే పనికొస్తుంది. కానీ నాయకత్వమనేది కొని తెచ్చుకునేది [more]

Update: 2020-03-19 13:30 GMT

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. లీడర్ షిప్ అనేది వారసత్వంగా వచ్చేది కాదు. అది పదవులు పొందేందుకే పనికొస్తుంది. కానీ నాయకత్వమనేది కొని తెచ్చుకునేది కాదు. అందిపుచ్చుకునేదన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష‌ విస్మరించినట్లుంది. నారా లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేవన్నది గత కొంతకాలంగా ఇంటా బయటా విన్పిస్తున్న మాట. ఆయన నాయకత్వాన్ని టీడీపీ నేతలే అంగీకరించడం లేదు.

సంక్షోభంలో ఉన్న సమయంలో…

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పూర్తి సంక్షోభంలో ఉంది. పార్టీ నేతలు క్లిష్టసమయంలో కాడి వదిలేసి వెళుతున్నారు. సీనియర్ నేతలు సయితం పట్టీ పట్టన్నట్లు కూర్చున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో పోరాటం చేయాల్సిన నారా లోకేష్ కేవలం ట్విట్టర్ కే పరిమితమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయన పాత్ర పరిమితంగానే కన్పించింది.

ఆయన తర్వాత ఈయనే అయినా….

చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాల్సింది నారా లోకేష్. ఇందులో ఏమాత్ర సందేహం లేదు. అయితే అధికారంలో ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు బయటపడవు. నిరూపించుకునేందుకు కూడా అవకాశం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అది వీలవుతుంది. జిల్లాల్లో పర్యటించడం, కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడం, ఎక్కడికక్కడ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యమాలు నిర్వహించడం వంటి వాటితోనే నాయకుడిగా ఎదుగుతారు.

సరైన సమయంలో…..

కానీ అధికారంలో ఉన్పప్పుడు పెత్తనం చెలాయించిన నారా లోకేష్ ఓటమి తర్వాత పార్టీకి ఏమాత్రం ఉపయోగ పడటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చంద్రబాబు మాత్రమే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. ఇక వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నా అటు వైపు నారా లోకేష్ చూడకపోవడం పార్టీలోనే విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు పార్టీని వీడి వెళుతున్న వారంతా లోకేష్ పై విమర్శలు చేస్తున్నా ఆయన సరైన సమయంలో కత్తి డాలు పట్టుకోకుండా ట్విట్టర్ లో కన్పిస్తుండటంతో ఇక నేతగా ఎలా ఎదుగుతారన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతలే లేవనెత్తుతున్నారు. మొత్తం మీద నారా లోకేష్ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా వినయోగించుకోవడం లేదన్నది వాస్తవం.

Tags:    

Similar News